Begin typing your search above and press return to search.

మనవడే నా లోకం

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:04 PM IST
మనవడే నా లోకం
X
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆనందాన్ని పట్టడం ఎవరి వల్లా కావడం లేదు. తన కుటుంబంలోని మూడో తరానికి తొలి వారసుడు వచ్చిన వేళ మంచు కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతోంది. మంచు విష్ణు జనవరి 1వ తేది మరోసారి తండ్రైన సంగతి తెలిసిందే. విష్ణు మొదటి సంతానం కవల ఆడ పిల్లలు. ఆ ఇద్దరి పేర్లతోనే బ్యానర్ స్టార్ట్ చేసి, లక్ష్మి ప్రసన్న బ్యానర్ కు అసోసియేట్ చేసి గాయత్రి సినిమా నిర్మిస్తున్నారు మోహన్ బాబు. ఇప్పుడు విష్ణు మూడో సంతానంగా మనవడు పుట్టడంతో తన సంతోషాన్ని వెంటనే ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. నటుడిగా బిజీ గా ఉన్నప్పుడు తనకు పిల్లలు కలిగితే మూడు షిఫ్ట్ లు షూటింగ్ లో ఉన్న తనకు ఇకపై అన్ని షిఫ్టులు మనవడితోనే అని ప్రకటించేసారు. చాలా కాలం తర్వాత హీరోగా మేకప్ వేసుకుని మోహన్ బాబు నటిస్తున్న గాయత్రి షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడే ఈ శుభం జరగడం విశేషంగా ఫీల్ అవుతున్నారు.

ఇటీవలే విడుదల చేసిన గాయత్రి పోస్టర్స్ కి మంచి స్పందన వస్తోంది. హీరోగా, విలన్ గా డ్యూయల్ రోల్ చేస్తున్నారు అనే వార్త ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది కాని యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. మంచు విష్ణు - శ్రేయ జంటగా ఫ్లాష్ బ్యాక్ లో కీలకమైన క్యామియోలలో కనిపించనున్నారు. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ప్రధానంశంగా రూపొందుతున్న గాయత్రి సినిమా ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్. త్వరలో దీనికి సంబంధించి ప్రకటన రానుంది. పెళ్ళైన కొత్తలో ఫేం మదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫైనల్ స్టేజిలో ఉంది.