Begin typing your search above and press return to search.

#MB45 క్ర‌మ‌శిక్ష‌ణ వ్య‌క్తిత్వంతోనే శిఖ‌రం ఎత్తుకు..!

By:  Tupaki Desk   |   22 Nov 2020 11:15 AM IST
#MB45 క్ర‌మ‌శిక్ష‌ణ వ్య‌క్తిత్వంతోనే శిఖ‌రం ఎత్తుకు..!
X
ముక్కుసూటిత‌నం.. నిర్మొహ‌మాటం.. గొప్ప‌ క్ర‌మ‌శిక్ష‌ణ ఇవ‌న్నీ డా.మంచు మోహ‌న్ బాబు పేరుతో పాటుగా వినిపించేవి. ఆ క్వాలిటీస్ తోనే ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక స్థాయిని తెచ్చుకున్నారంటే అతిశ‌యోక్తి కాదు. క్ర‌మ‌శిక్ష‌ణ లేనిదే ఏ న‌టుడూ ఇంత‌గా రాణించ‌డం అనేది కుద‌ర‌ని ప‌ని. అన్న‌గారు ఎన్టీఆర్ వార‌సత్వంగా ఆయ‌న‌కు అబ్బిన గుణం ఇద‌ని చెబుతారు. దర్శ‌క‌ర‌త్న దాస‌రి శిష్యుడిగానూ ఆయ‌న ఎంతో నేర్చుకుని ఇండ‌స్ట్రీలో లెజెండ‌రీగా ఎదిగారు.

మంచు మోహన్ బాబు సౌత్ లో గొప్ప విల‌క్ష‌ణ‌నటుడిగా పాపుల‌ర‌య్యా‌రు. స‌మ‌కాలీన న‌టులు ర‌జ‌నీకాంత్.. చిరంజీవిలతో పాటు త‌న పేరును సౌత్ హిస్ట‌రీలో సుస్థిరం చేసుకున్న మేటి న‌టుడిగా ఆయ‌న రికార్డుల‌కెక్కారు. ఇంతింతై క‌లెక్ష‌న్ కింగ్ అన్నంత స్థాయికి ఎదిగారు. కెరీర్ గొప్ప ద‌శ‌లో ఉండ‌గానే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. స‌మ‌కాలీన స్టార్ల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్లు చేశారు. స్టైలిష్ కామెడీ విల‌నీ అంటే ఏంటో చూపించారు ఎంబీ. త‌దుప‌రి ఒక చిత్రానికి దర్శకత్వం వహించడానికి మోహన్ బాబు ఆసక్తిని కనబర‌చ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కొచ్చింది.

నటుడు-నిర్మాత.. ఇప్పుడు డైరెక్ట‌ర్ అయ్యే ఆలోచ‌న ఉంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇటీవ‌లే ఓటీటీ విడుద‌లైన‌ సూర్య `సూరరావు పొట్రూ` (తెలుగులో ఆకాశ‌మే హద్దురా) లో ఎంబీ ఓ కీలక పాత్రలో కనిపించారు. మోహన్ బాబు స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా తన కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. డైరెక్ష‌న్ డెబ్యూకి సంబంధించిన అతిపెద్ద ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. నేటితో మోహ‌న్ బాబు న‌టించిన తొలి చిత్రం స్వ‌ర్గం న‌ర‌కం (22 న‌వంబ‌ర్ 1975) విడుదలై 45 సంవ‌త్స‌రాలైంది. ఈ 45 ఏళ్ల కెరీర్ లో ఎంబీ ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు. లెజెండ‌రీగా మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఎంబీ 45 పేరుతో అభిమానులు సంబ‌రాల్లో మునిగి తేలారు. అందుకు సంబంధించిన పోస్ట‌ర్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. #45YearsOfMohanBabu #MB45 పేరుతో ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి.