Begin typing your search above and press return to search.
సినీ సెలెబ్రెటీల శుభాకాంక్షలకు మోడీ రిప్లై
By: Tupaki Desk | 18 Sept 2020 10:30 AM ISTభారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశ రాజకీయాల్లోనే అత్యంత పాపులర్ పీఎం అయిన మోడీకి సినీ, రాజకీయ, ప్రముఖుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు సచిన్, విరాట్, సహా తాజా, మాజీ క్రికెటర్లు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. మోడీతో తాను క్రికెట్ ఆడే రోజుల్లో దిగిన ఫొటోను సచిన్ ట్వీట్ చేసి విషెస్ తెలిపారు.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో పాటు , అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , అరవింద్ కేజ్రీవాల్ , రాహుల్ గాంధీ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు . తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తో సహా దేశంలోని రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విషెస్ తెలిపారు.
ఇక దేశాధినేతలు ట్రంప్, పుతిన్ సహా చాలా మంది దేశాల అధ్యక్షులు, ప్రధానులు మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, సహా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులంతా ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వివాదాస్పద నటి కంగనా రౌనత్ ప్రత్యేకంగా మోడీకి విషెస్ తెలిపింది.
కాగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మోడీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.