Begin typing your search above and press return to search.

చేనేత కుటుంబాల్ని స్టార్లే బతికించాలి

By:  Tupaki Desk   |   7 Aug 2015 6:36 PM IST
చేనేత కుటుంబాల్ని స్టార్లే బతికించాలి
X
చేనేత రంగం అంటే ఆంధ్రప్రదేశ్‌ తో అనుబంధం ఉన్న రంగం. ఇక్కడ చేనేత కార్మికులు చాలా ఎక్కువ. చేనేత వస్తువులు, చేనేతలో తయారైన కళాత్మక వస్త్రాలు, వస్తూత్పత్తులు బైట మార్కెట్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటి సప్లయ్‌ కి తగ్గట్టే అమ్మకాలు మాత్రం లేవన్నది వాస్తవం. అయితే అలాంటి వాటి అమ్మకాలు పెరగడానికి మన సినిమా స్టార్లే ముందుకు రావాలని, ప్రచారం చేసి చేనేతపై ఆధారపడే కుటుంబాలకు బాసటగా నిలవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

స్వాతంత్య్రోద్యమ కాలం నాడే చేనేత ఉత్పత్తులతో ఆంగ్లేయులపై నిరసన పూరించిన మనం ఈరోజు ఎందుకు ఈ రంగాన్ని ప్రోత్సహించలేకపోతున్నామని హితవు పలికారాయన. ప్రతి స్టార్‌ తాము నటించే సినిమాల్లో కనీసం ఐదింట ఒక సినిమాలో చేనేత ఉత్పత్తుల్నే ఉపయోగిస్తే ఆ మేరకు ఆ రంగానికి ప్రచారం వస్తుందని బతుకు తెరువు లభిస్తుందని ప్రధాని ఉద్భోదించారు. ఈరోజు జాతీయ హ్యాండ్లూమ్‌ డే సందర్భంగా ఇండియన్‌ హ్యాండ్లూమ్‌ ఉత్పత్తుల్ని ఆవిష్కరించారాయన.

వింటున్నారా టాలీవుడ్‌ స్టార్స్‌ ? ప్రధాని ఏమని పిలుపునిచ్చారో? స్వచ్ఛ భారత్‌ అంటూ రోడ్లు ఊడ్చడానికి బైటికొచ్చారు. ఇకముందు ఎలాంటి బృహత్తర బాధ్యత మనకి ఉందో అర్థమైందా? ఇక నుంచి చేనేత రంగానికి ఊతమివ్వండి. మీ సినిమాల్లో ప్రోత్సహించండి. జైహింద్‌.