Begin typing your search above and press return to search.

ఒకే సినిమా అక్కడ ఇక్కడ ఎందుకు చూస్తారు?

By:  Tupaki Desk   |   24 Jan 2020 5:21 AM GMT
ఒకే సినిమా అక్కడ ఇక్కడ ఎందుకు చూస్తారు?
X
సంక్రాంతి సందర్బంగా జెమిని టీవీ వారు చాలా అంచనాలు పెట్టుకుని సైరా చిత్రాన్ని ప్రసారం చేసింది. 20 రేటింగ్‌ వస్తుందని ఆశించిన జెమిని టీవీ వారికి షాక్‌ తగిలింది. కేవలం 11.81 రేటింగ్‌ మాత్రమే దక్కింది. సైరా ప్రసారంకు రెండు రోజుల ముందు వరుణ్‌ తేజ్‌ గద్దలకొండ గణేష్‌ చిత్రం ప్రసారం అయ్యింది. ఆ సినిమాకు ఏకంగా 13 రేటింగ్‌ దక్కింది. మెగాస్టార్‌ క్రేజ్‌.. సైరా మేకింగ్‌.. పాన్‌ ఇండియా సినిమా అంటూ ప్రచారం జరిగింది. అయినా కూడా బుల్లి తెరపై సైరాను తక్కువ చూడటంకు ప్రధాన కారణం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

సైరా చిత్రంకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. అంటే ఎక్కువ మంది సినిమాను చూసినట్లు. ఇక టీవీలో ప్రసారంకు ముందే అమెజాన్‌ ప్రైమ్‌ లో సైరా విడుదల అయ్యింది. ఈమద్య కాలంలో అమెజాన్‌ ప్రైమ్‌ చూస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా అయ్యింది. అమెజాన్‌ లో తెలుగు సినిమాలకు కూడా లక్షల్లో వ్యూస్‌ వస్తున్నట్లుగా ఆమద్య సంస్థ ప్రకటించింది. అంటే లక్షలాది మంది సైరా చిత్రాన్ని చూసి ఉంటారు.

థియేటర్లలో మరియు అమెజాన్‌ ప్రైమ్‌ లో అంత మంది చూసిన తర్వాత టీవీల్లో చూసే వారు ఎవరు ఉంటారు. పల్లెటూర్ల లో కొద్ది మంది మాత్రమే సైరాను బుల్లి తెరపై చూసి ఉంటారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల లో లేదా అమెజాన్‌ ప్రైమ్‌ లో చూసి మళ్లీ టీవీల్లో చూడాలని ఎవరు మాత్రం అనుకుంటారు. అందుకే అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అయిన సినిమాలు బుల్లి తెరపై చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్‌ ను దక్కించుకుంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి ఛానెల్‌ యాజమాన్యాలు ఇక పై సినిమాలు కొనుగోలు చేసే ముందు ఆలోచిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.