Begin typing your search above and press return to search.

తనుశ్రీ కి ఛాన్స్ ఇస్తే తాట తీస్తాం..!

By:  Tupaki Desk   |   3 Oct 2018 10:45 AM GMT
తనుశ్రీ కి ఛాన్స్ ఇస్తే తాట తీస్తాం..!
X
ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' లో అమీర్ ఖాన్ ముక్కు రింగు.. అమితాబ్ బచ్చన్ ఆ ట్రైలర్ లో చేసిన స్టంట్లు కాదు.. '2.0' టీజర్ లో అక్షయ్ కుమార్ కాకి వేషం కూడా కానే కాదు. తనుశ్రీ దత్తా. ఆమె ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. రీసెంట్ గా తనుశ్రీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ ఎస్) పార్టీ వారు తనపై దాడి చేస్తామని బెదిరించారని ఫ్రెష్ స్టేట్ మెంట్ విడుదల చేసింది.

ఇక దీనిపై చర్చ జరుగుతుండగానే ఎంఎన్ ఎస్ పార్టీ కార్యకర్తలు హిందీ బిగ్ బాస్ టీమ్ ను బెదిరించారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మధ్యలో ఈ హిందీ బిగ్ బాస్ ఎక్కడినుండి ఊడి పడ్డాడని మీకు అనుమానం రాలేదా? ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తనుశ్రీ దత్తా ను తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఎంఎన్ ఎస్ పార్టీ కార్యకర్తలు.. 'తనుశ్రీ ని కనుక బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానించిన పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి' అంటూ అమ్చీ ముంబై స్టైల్ లో హెచ్చరికలు జారీ చేశారట.

ఇక ఈ విషయంపై బిగ్ బాస్ టీమ్ వారు ఇప్పటివరకూ పోలీసులను ఆశ్రయించలేదట. అసలు తనుశ్రీ కి బిగ్ బాస్ నుండి ఇన్విటేషన్ వస్తుందో లేదో తెలీదు. వచ్చినా ఆమె వెళ్తుందో లేదో తెలీదు. కానీ ఆమె పేరుతో జోరుగా హంగామా మాత్రం జరుగుతోంది