Begin typing your search above and press return to search.

MM కీర‌వాణి SS రాజ‌మౌళి.. ఇంటి పేరు మారిందేమిటీ?

By:  Tupaki Desk   |   6 March 2023 2:56 PM IST
MM కీర‌వాణి SS రాజ‌మౌళి.. ఇంటి పేరు మారిందేమిటీ?
X
కేరాఫ్ SS రాజ‌మౌళి కేరాఫ్ MM కీర‌వాణి గురించి ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. కానీ ఆ ఇద్ద‌రి పెద‌నాన్న అయిన‌ మ‌ల్టీ ట్యాలెంటెడ్ శివ‌శ‌క్తి ద‌త్తా సినీ నేప‌థ్యం గురించి పెద్ద‌గా తెలీదు. నిజానికి కోడూరి కుటుంబానికి శివ‌శ‌క్తి ద‌త్తా ఆదిగురువు. ప‌రిశ్ర‌మ‌లోకి అత‌డు అడుగుపెట్ట‌డం కోడూరికి మేలిమి మ‌లుపు. కోడూరి కుటుంబం అంతా టాలీవుడ్ కి అంకిత‌మ‌వ్వ‌డానికి అతడే కార‌కుడనేది కొంద‌రికే తెలిసిన నిజం. శివ‌శ‌క్తి ద‌త్తాకు ఐదుగురు అన్న‌ద‌మ్ములు. ఒక సోద‌రి. ఇప్ప‌టికే ఇద్ద‌రు సోద‌రుల‌ను కోల్పోయిన కోడూరి కుటుంబంలో ఇత‌రులంతా సినీప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మై ప‌ని చేస్తున్నారు. శివ‌శ‌క్తి ద‌త్తా- విజ‌యేంద్ర ప్ర‌సాద్ బ్ర‌ద‌ర్స్ వారి ఇరువురి వంశ వృక్షం ప‌రిశ్ర‌మ‌లో పాదుకొని ఉంది.

సంచ‌ల‌నాల రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ శివ‌శ‌క్తి ద‌త్తా త‌మ్ముడు. విజ‌యేంద్రుని కుమారుడు SS రాజ‌మౌళి.. శివ‌శ‌క్తి ద‌త్తా కుమారుడు MM కీర‌వాణి. MM కీర‌వాణి SS రాజ‌మౌళి సోద‌రులే కానీ ఇంటి పేరే తేడా ఎందుకు? అనే సందేహం చాలా మందికి ఉంది. MM అంటే ఏమిటి? SS అంటే ఏమిటి? ఇంటి పేర్లు మారాయి క‌దా? అనే సందేహాలున్నాయి. అలాగే శివ‌శ‌క్తి- విజ‌యేంద్రునికి మ‌ధ్య‌లో మ‌రో బ్ర‌ద‌ర్ బోస్ కుమార్తె మ‌ణిమేక‌ల (ఎం.ఎం) శ్రీ‌లేఖ‌. కానీ ఎంఎం అంటే ఏమిటి? అనే సందేహం అంద‌రికీ ఉంది.

నిజానికి కీర‌వాణి- రాజ‌మౌళి- శ్రీ‌లేఖ ఈ ముగ్గురి ఇంటి పేరు ఒక‌టే. అది 'కోడూరి'. కీర‌వాణి బిరుదు మ‌ర‌క‌త‌మ‌ణి. మ‌ర‌క‌త‌మ‌ణి అంటే ఎమ‌రాల్డ్ అని అర్థం.. త‌మిళం మ‌ల‌యాళంలో మ‌ర‌క‌త‌మ‌ణి అని త‌న పేరు ముందు టైటిల్ కార్డ్ లో వేస్తారు. తెలుగులో ఎం.ఎం.కీర‌వాణి అని తెర‌పై టైటిల్ కార్డ్ ప‌డుతుంది.

SS రాజ‌మౌళి లో SS అంటే శ్రీ‌శైల శ్రీ అని అర్థం. శ్రీ‌శైల శ్రీ రాజ‌మౌళి అనేది పూర్తి పేరు. అలాగే ఎం.ఎం శ్రీ‌లేఖ‌లో ఎం.ఎం. అంటే మ‌ణిమేక‌ల అని అర్థం. మ‌ణిమేక‌ల‌ శ్రీ‌లేఖ అని పిలుస్తారు. మ‌ణిమేక‌ల అనేది కూడా కుటుంబంలో వారు ఎంపిక చేసుకున్న‌ ముద్దు పేరు. వీళ్లంద‌రికీ స‌ర్ నేమ్ కోడూరి మాత్ర‌మేన‌ని శివ‌శ‌క్తి ద‌త్తా స్వ‌యంగా క్లారిటీనిచ్చారు. సిస్ట‌ర్ తో పాటు మేం ఇద్ద‌రం ఉన్నాం. ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నాం. ఇద్ద‌రు సోద‌రులు శివైక్యం అయ్యార‌ని కూడా తెలిపారు ద‌త్తా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.