Begin typing your search above and press return to search.

బన్నీ ఎమ్మెల్యే బాలయ్య కోసం ఐఏఎస్‌ గా..!

By:  Tupaki Desk   |   30 Dec 2019 9:37 AM GMT
బన్నీ ఎమ్మెల్యే బాలయ్య కోసం ఐఏఎస్‌ గా..!
X
అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' చిత్రంలో కేథరిన్‌ తెర్సా ఎమ్మెల్యే పాత్రను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో కేథరిన్‌ ఎమ్మెల్యే పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆ పాత్రలో కేథరిన్‌ నటన ఆకట్టుకుంది. బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో చేయబోతున్న సినిమాలో కూడా కేథరిన్‌ ను హీరోయిన్‌ గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే గా నటించిన కేథరిన్‌ ఈసారి బాలయ్య సినిమా లో ఐఏఎస్‌ పాత్ర లో కనిపించబోతుందట.

బోయపాటి విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కథతో బాలయ్యను పవర్‌ ఫుల్‌ గా చూపిస్తూ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఆ కథలో కీలకమైన ఐఏఎస్‌ పాత్రలో కేథరిన్‌ కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హీరో ప్రధానంగా ఉండే సినిమాల్లో హీరోయిన్స్‌ ఐఏఎస్‌ లు గా కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. బాలయ్య సినిమాలో కేథరిన్‌ ఐఏఎస్‌ గా కనిపించబోతున్న నేపథ్యంలో చాలా విభిన్నంగా ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య మరియు బోయపాటిల కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే వీరి కాంబోలో హ్యాట్రిక్‌ ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన టైటిల్‌ ను ప్రకటించేందుకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నాడు. బోయపాటి వినయ విధేయ రామ చిత్రం తో నిరాశ పర్చాడు. ఆ సినిమా ఫ్లాప్‌ తో కెరీర్‌ ఇబ్బందుల్లో పడ్డట్లయ్యింది. కాని బాలయ్య ఇచ్చిన ఆఫర్‌తో బోయపాటికి మళ్లీ తన సత్తా చాటుకునే అవకాశం దక్కింది. మరి బోయపాటి నిరూపించుకుంటాడా చూడాలి.