Begin typing your search above and press return to search.

మరో డైరెక్టర్ కి ఆడీ కారు గిఫ్ట్!

By:  Tupaki Desk   |   4 Nov 2016 4:13 AM GMT
మరో డైరెక్టర్ కి ఆడీ కారు గిఫ్ట్!
X
ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే కచ్చితంగా ఆ విజయంలో మాగ్జిమం క్రెడిట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కే దక్కుంతుంది! దీంతో ఈ మద్యకాలంలో తమకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకులకు నిర్మాతలు లేదా హీరోలు బహుమతులు లు ఇవ్వటం ఆనవాయితీగా మారింది. ఆ మధ్యన "శ్రీమంతుడు" సూపర్ హిట్ కావడంతో హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివకు ఒక కారుని గిప్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అవకాశం తమిళ దర్శకుడు ఎ ఎల్ విజయ్ ని వరించింది.

తమిళంలో "దేవి" (తెలుగులో అభినేత్రి) సినిమా ద్వారా దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ ప్రేక్షకుల హృదయాలనే కాదు నిర్మాతల హృదయాలనూ దోచుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే... కలెక్షన్స్ రూపంలో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారని తెలుస్తోన్న క్రమంలో... తన మనసునూ గెలుచుకున్నాడని ఆ నిర్మాత ఐసరి కె గణేశ్‌, విజయ్ కి ప్రభుదేవాతో కలిసి ఆడీ కారును బహుమతిగా ఇచ్చారట. "దేవి" చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ... "కష్టం ఫలితాన్ని ఇస్తుంది! ప్రభుదేవా, కె.గణేశ్‌ కలిసి కారును బహూకరించిన 'దేవి' దర్శకుడు విజయ్‌ కి శుభాకాంక్షలు" అని ట్వీట్‌ చేసింది.

ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో ప్రభుదేవా - తమన్నా - సోనూసూద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "దేవి". ఈ చిత్రాన్ని తెలుగులో "అభినేత్రి", హిందీలో "టుటక్‌ టుటక్‌ టుటియా" పేర్లతో విడుదల చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/