Begin typing your search above and press return to search.

ఆ కామెంట్స్‌ ఏంటో అర్థం కావట్లేదు : సమంత

By:  Tupaki Desk   |   29 March 2019 9:17 AM GMT
ఆ కామెంట్స్‌ ఏంటో అర్థం కావట్లేదు : సమంత
X
పెళ్లి అయిన తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తుందనే విషయం తెల్సిందే. అన్ని సినిమాలకు ఓకే చెప్పకుండా కేవలం నటనకు ఆస్కారం ఉన్న సినిమాలను, నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే ఈ అమ్మడు చేస్తోంది. తమిళంలో తాజాగా ఈమె 'సూపర్‌ డిలక్స్‌' అనే చిత్రంలో నటించింది. నేడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ఆ చిత్రంలో వ్యాంప్‌ పాత్ర పోషించడం చర్చనీయాంశం అయ్యింది.

చాలా విభిన్నమైన పాత్ర అవ్వడంతో పాటు, నటన ప్రతిభ చూపించే పాత్ర అవ్వడం వల్ల తాను ఆ సినిమాలో నటించాను అంటూ గతంలో సమంత చెప్పుకొచ్చింది. ఆ చిత్రంలో సమంత నటనకు విడుదల తర్వాత అంతా భావించినట్లుగానే విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా సమంత తన పాత్రకు దక్కుతున్న కామెంట్స్‌ విషయంలో స్పందిస్తూ... వాటిని ప్రశంసల మాదిరిగా తీసుకోవాలో, విమర్శలుగా తీసుకోవాలో అర్థం కావడం లేదు అంటోంది.

నెటిజన్స్‌ మాత్రం సమంత కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ను ఈ చిత్రంలో ఇచ్చింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సినిమాలోని అన్ని పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సమంత పాత్ర కూడా సినిమాకు ఆయువు పట్టు అన్నట్లుగా ఉంటుంది. తన పాత్రకు సమంత పూర్తి న్యాయం చేయగలిగింది అంటూ టాక్‌ వినిపిస్తుంది. వ్యాంప్‌ పాత్ర చేయడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు, అందుకే ఆ కామెంట్స్‌ ను సమంత విమర్శలు అని కూడా భావిస్తుంది. సమంత మరో వారంలో 'మజిలీ' చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చైతూతో కలిసి నటించిన మజిలీ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.