Begin typing your search above and press return to search.

RRR టైటిల్ కు మిశ్రమ స్పందన.. అప్పుడే పోలికలు!

By:  Tupaki Desk   |   25 March 2020 2:30 PM GMT
RRR టైటిల్ కు మిశ్రమ స్పందన.. అప్పుడే పోలికలు!
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రాజమౌళి సినిమా టైటిల్ వచ్చేసింది. జస్ట్ టైటిల్ మాత్రమే వెల్లడించి సరిపెట్టకుండా సినిమా థీమ్.. ప్రధాన పాత్రల స్వభావం ప్రతిబింబించేలా ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఈ పోస్టర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభం అయ్యాయి.

ఈ మోషన్ పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ రాజమౌళి "నీరు నిప్పును ఆర్పేస్తుంది. నిప్పు నీటిని ఆవిరిగా మార్చేస్తుంది. ఎంతో శక్తివంతమైన ఈ రెండూ ఒకటిగా మారినప్పుడు.. RRR టైటిల్ లోగోను ప్రెజెంట్ చేస్తున్నాము" అంటూ కొంత ఇంట్రో ఇచ్చారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ను నీటికి ప్రతిరూపంగా.. చరణ్ ను నిప్పుకు ప్రతిరూపంగా చూపించారు. ఇక టైటిల్ ను 'రౌద్రం రణం రుధిరం' గా వెల్లడించారు.

ఈ మోషన్ పోస్టర్ పై టైటిల్ పై కొంతవరకూ మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. సూపర్ అని కొందరు అంటున్నారు కానీ కొందరు మాత్రం టైటిల్ 'బాహుబలి' స్థాయిలో లేదని.. 'బాహుబలి' సమయంలో టైటిల్ కు వచ్చిన ఫీల్ ఇందులో మిస్ అయిందని అంటున్నారు. ఇదిలా ఉంటే కొందరు ఇతర సినిమాలతో పోలికలు వెతకడం మొదలు పెట్టారు. అయితే సినిమాలతో పోలికలు లేవు కానీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ త్రోన్స్ లో పోలికలు వస్తున్నాయి.

గేమ్ అఫ్ త్రోన్స్ లో సాంగ్ అఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే కాన్సెప్ట్ ఉంది. అందులో నైట్ కింగ్ Vs డ్రాగన్ క్వీన్ పోరాటం ఐస్ కు ఫైర్ కు మధ్య జరిగే పోరాటం లాంటింది. ఇక్కడ ఎన్టీఆర్ ను వాటర్ గా ఐస్ బ్లూ కలర్ లో చరణ్ ను ఫైర్ గా చూపించడంతో ఇది గేమ్ ఆఫ్ త్రోన్స్ లో ని కాన్సెప్ట్ ను పోలి ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెట్టి చూసినప్పటికీ 'బాహుబలి' సినిమా టైటిల్ కు ఉన్నంత ఇంటెన్సిటీ ఈ టైటిల్ కు రాలేదని కూడా అంటున్నారు. మరి అక్కడ ఉండేది జక్కన్న కాబట్టి టీజర్.. ట్రైలర్ తో మ్యాజిక్ చేస్తారేమో వేచి చూడాలి.