Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కొడుకుపై అత్యాచార కేసు

By:  Tupaki Desk   |   3 July 2018 11:18 AM IST
స్టార్ హీరో కొడుకుపై అత్యాచార కేసు
X
అలనాటి బాలీవుడ్ హీరో - మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి కొడుకు చిక్కుల్లో పడ్డాడు. మిథున్ కొడుకు మహాక్షయ్ చక్రవర్తిపై తాజాగా చీటింగ్ - అత్యాచార కేసు నమోదైంది. మహాక్షయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక యువతి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ముంబైలో ఉంటున్న మహాక్షయ్ మూడేళ్లుగా తనతో డేటింగ్ లో ఉంటున్నాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని. ఆ తర్వాత ఇష్టం లేకున్నా అబార్షన్ చేయించాడని ఆ యువతి ఆరోపించింది. కొడుకు చేసిన తప్పులను సరిద్దదకపోగా మహాక్షయ్ కు అతడి తల్లి యోగితా బాలి కూడా సహకరించిందని .. ఇద్దరిపై ఫిర్యాదు చేసినట్లు భాధిత యువతి పేర్కొంది.

అయితే ఈ వ్యవహారం వెలుగుచూడడం వెనుక మహాక్షయ్ కి పెళ్లి కుదరడమే కారణం.. ఇటీవల ఓ హీరోయిన్ తో మహాక్షయ్ కు పెళ్లి కుదిరింది. జూలై 7 ను వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ హీరోయిన్ తో కూడా మహాక్షయ్ మూడేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో పెద్దల అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్ ఇంట్లో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో మరో యువతి మహాక్షయ్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.