Begin typing your search above and press return to search.

వావ్!! గ్లామర్ అవతారంలో క్రికెట్ రాణి

By:  Tupaki Desk   |   1 Nov 2017 10:52 AM GMT
వావ్!! గ్లామర్ అవతారంలో క్రికెట్ రాణి
X
ఇండియన్ ఉమెన్ క్రికెట్ కు క్వీన్ ఎవరు అంటే మిథాలీ రాజ్ అనే సమాధానం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇండియన్ ఉమెన్ క్రికెట్ కి కెప్టెన్ గా తన రేంజ్ తో పాటు.. మహిళా క్రికెట్ సత్తాను కూడా పెంచుతోంది ఈ యంగ్ లేడీ. ఈ ఏడాది మన టీంని వరల్డ్ కప్ ఫైనల్ వరకూ తీసుకెళ్లిన తర్వాత.. మిథాలీ రాజ్ రేంజ్ మరింతగా మారిపోయింది.

ఇదే సమయంలో గ్లామర్ యాంగిల్ లో కూడా తన ట్యాలెంట్ చూపిస్తోంది ఈ బ్యూటీ. క్రికెట్ క్వీన్ గా ఉంటూ ఇలా గ్లామర్ చూపించడంపై ట్రాలింగ్ కూడా నడించింది. ఓ సెక్సీ సెల్ఫీ విషయంలో బోలెడన్ని విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికి విరుగుడుగా అన్న చందంగా ఓ స్పెషల్ ఫోటో షూట్ చేసింది మిథాలీ రాజ్. ఈ ఫోటో షూట్ లో కూడా మిథాలీ క్రికెట్ ఆడుతూ ఉంటుంది కానీ.. డ్రెసింగ్ చూస్తే అసలు విషయం ఏంటనే సంగతి అర్ధమవుతుంది. బ్లాక్ కలర్ టాప్ ను ధరించి.. కొంత ఎక్స్ పోజింగ్ యాంగిల్ ను కూడా మిక్స్ చేసి మిథాలీ రాజ్ చేసిన స్పెషల్ ఫోటో షూట్ గ్లామర్ ప్రియులను తెగ మెప్పించేయడం ఖాయం.

ఇదే సమయంలో.. తనను ట్రాలింగ్ చేసే వారిని చెంపదెబ్బ కొట్టినట్లుగా ఉంది మిథాలీ రాజ్ రియాక్షన్. తనకు అచ్చొచ్చిన క్రికెట్ నే గ్లామర్ ను మిక్స్ చేసి ఆడుతున్నట్లుగా ఇచ్చిన పోజులు అయితే.. కుర్రాళ్లకు విపరీతంగా నచ్చేస్తున్నాయి. మరి వీటిపై నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.