Begin typing your search above and press return to search.

మిథాలీ క్లీవేజ్ షోకి తిట్ల దండ‌కం

By:  Tupaki Desk   |   7 Sep 2017 7:47 AM GMT
మిథాలీ క్లీవేజ్ షోకి తిట్ల దండ‌కం
X
ఎవ‌రెలా క‌నిపించాల‌న్న‌ది వారి ఇష్టం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఎవ‌రికి వారికి వారి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీల విష‌యంలో కొత్త స‌మ‌స్య‌లు.. వివాదాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం లేకపోలేదు. స‌మ‌స్యంతా ఎక్క‌డ వ‌స్తుందంటే.. తాము అభిమానించే సెల‌బ్రిటీలు ఫ‌లానా తీరులో ఉండాల‌ని అభిమానులు ఫిక్స్ అవుతుంటే.. మీరెవ‌రు? నా వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను.. ఇష్టాయిష్టాల్ని ప్ర‌శ్నించ‌టానికి అంటూ సెల‌బ్రిటీలు మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఈ త‌ర‌హా వివాదాలు కొంద‌రు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు ఎదురైన సంగ‌తి తెలిసిందే. తాజాగా భార‌త మ‌హిళ‌ల కెప్టెన్ మిథాలిరాజ్‌కు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. ఆమె డ్రెస్సింగ్ తీరుపై నెటిజ‌న్లు పెద్ద ఎత్తున మండిప‌డుతున్నారు. త‌న ఆట‌తో అభిమానుల మ‌న‌సుల్ని దోచుకున్న మిథాలీ.. తాజాగా త‌న గ్లామ‌ర‌స్ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.

ఆ ఫోటోలో క్లీవేజ్ స్ప‌ష్టంగా క‌నిపించ‌టంతో మిథాలీ తీరును నెటిజ‌న్లు త‌ప్పు ప‌డుతున్నారు. త‌న తోటి క్రీడాకారిణుల‌తో క‌లిసి దిగిన ఈ ఫోటోలో మిగిలిన వారంతా డ్రెస్సింగ్ విష‌యంలో నిండుగా ఉంటే.. మిథాలీ మాత్రం అందుకు భిన్నంగా పూర్తి గ్లామ‌ర‌స్ గా ఉండ‌టంపై ఫైర్ అవుతున్నారు. మిథాలీ డ్రెస్ బాగోలేద‌ని.. ఆమె హీరోయిన్ కాద‌ని క్రికెట‌ర్ అంటూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోను తొల‌గించాల‌ని కోరుతున్నారు.

ప్ర‌జ‌ల గురించి తెలిసి కూడా ఇలాంటి ఫోటోను పోస్ట్ చేయ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్న నెటిజ‌న్లు.. మిథాలీ వ‌స్త్ర‌ధార‌ణ‌పై నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. దీనిపై ఆమె ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు. గ‌తంలోనూ త‌న‌పై వ్య‌క్తిగ‌త అంశాల‌పై విమ‌ర్శ‌లు చేసిన వారిపై మిథాలీ అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు త‌న వ‌స్త్ర‌ధార‌ణ విష‌యంలో ఆమె ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.