Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: నిజంగా జరిగిన కథ!

By:  Tupaki Desk   |   15 Oct 2018 11:07 PM IST
ట్రైలర్ టాక్: నిజంగా జరిగిన కథ!
X
అన్నీ సినిమాలకు ముందు ముకేష్.. రాహుల్ ద్రావిడ్ యాడ్ వస్తుందే కానీ అన్నీ సినిమాలు ఒకేవిధంగా ఉంటాయా? కొన్ని 'మిఠాయి' లా కూడా ఉంటాయి. రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి - కమల్ కామరాజు - రవి వర్మ లు నటించిన ఈ మాడరన్ అడల్ట్ కామెడీ డ్రామా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.

రాహుల్ - ప్రియదర్శి లు ఇద్దరూ కాస్త తేడాగా ఉండే ఈ జెనరేషన్ హైదరాబాదీలు. రాహుల్ రామకృష్ణ ఒక కార్పోరేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. రాహుల్ పెళ్ళి కుదిరి ఇక వారంలో ఒక ఇంటివాడు అయ్యేంతలో ఇద్దరూ స్నేహితులు అనుకోని ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఇదీ ట్రైలర్ లో రివీల్ చేసిన ప్లాట్. "నేను.. వాడు ఇక్కడ పాయిఖానాలు కడిగేటందుకు వచ్చినామారా హౌలే".. "మందెవడు తీసుకోస్తాడ్రా.. నీ అయ్యనా?" అంటూ ప్రియదర్శి మార్క్ క్యాజువల్ డైలాగ్స్ వెంటనే యూత్ కు కనెక్ట్ అయ్యేవే.

"వాట్ ఈజ్ యువార్ బ్యాండ్ కాల్డ్?" అని అడిగితే కమల్ "ఫోర్ షాట్స్ అండ్ ఎనస్ జాబ్" అంటాడు. అంటే ఏంటని ఇక్కడ రాసుకోలేం గానీ గూగులమ్మను అడగండి. ఈ జెనరేషన్ కామెడీ కాబట్టి కాస్త హార్డ్ గానే ఉంది. ఇక ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక మీరు కూడా ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

Watch Here : https://www.youtube.com/watch?v=goNjz6PJGBA