Begin typing your search above and press return to search.

ఏంటి.. ఇంకా ఒక సాంగ్ పెండింగా?

By:  Tupaki Desk   |   1 April 2017 7:22 AM GMT
ఏంటి.. ఇంకా ఒక సాంగ్ పెండింగా?
X
ఆల్రెడీ గతంలో స్పెయిన్ లో ఏకంగా ఒక భారీ షెడ్యూల్ నే ఫినిష్‌ చేశారు ''మిష్టర్'' అండ్ కో. అయితే అప్పటి షెడ్యూల్ లో కొన్ని పాటలను సీన్లను తీసినా కూడా ఇంకా ఒక పాట బ్యాలెన్స్ ఉందట తెలుసా? అవును.. అందుకే ఇప్పుడు మిష్టర్ సినిమాలో పాటను తీయడానికి టీమ్ అంతా కలసి ఇటలీ బయలుదేరింది.

ఇప్పటికే ఏప్రియల్ 13న రిలీజ్ అని ప్రకటించేయడంతో.. నిన్ననే హీరో వరుణ్‌ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్ని మీడియాలకు ఇంటర్యూలు కూడా ఇచ్చేశారు. అయితే వీరు కంటిన్యూస్ ఇలా ఇంటర్యూలతో దూసుకుపోతారు అనుకుంటే.. ఈరోజు ఉదయం మస్కట్ మీదుగా ఇటలీలోని మిలాన్ నగరానికి బయలుదేరారు. వీరితో దర్శకుడు శ్రీను వైట్ల కూడా వెళ్లారు. ఇకపోతే సెక్సిణి హెబ్బా పటేల్ రెండు రోజుల ముందే ఇటలీ చేరుకుంది. అక్కడ వీరిపై ఒక పాట.. మరో పాటకు చెందిన కొన్ని మాంటేజ్ లు తీస్తారని తెలుస్తోంది.

ఆల్రెడీ స్పెయిన్ లో షూటింగ్ చేసినప్పుడే ఈ పాటలన్నీ ఫినిష్‌ చేసుకుని ఉంటే.. ఈ ఎక్స్ ట్రా ఖర్చులు మిగిలిపోయేవిగా బాసూ? మరి ట్రైలర్ తో కేవలం యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకున్న ''మిష్టర్'' సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/