Begin typing your search above and press return to search.

మిస్టర్ కూడా ముందుకొచ్చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   29 March 2017 12:16 PM GMT
మిస్టర్ కూడా ముందుకొచ్చేస్తున్నాడు
X
టాలీవుడ్ లో ఇప్పుడు ప్రీపోన్ సీజన్ నడుస్తున్నట్లుగా ఉంది. ముందుగా షెడ్యూల్ చేసుకున్న సినిమాలు కూడా అంతో ఇంతో ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే వెంకటేష్ గురు చిత్రం ఏప్రిల్ 7 నుంచి మార్చ్ 31కి కదిలి వచ్చేసింది. అదే డేట్ కి వస్తున్న పూరీ జగన్నాధ్ మూవీ రోగ్ కూడా.. రీసెంట్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నదే.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం మిస్టర్. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు ముందుకు జరగడం విశేషం. ఏప్రిల్ 14న మిస్టర్ రిలీజ్ చేయనున్నారనే విషయంలో ముందు నుంచి క్లారిటీ ఉంది. ఇప్పుడీ సినిమాను ఓ రోజుకు ముందుకు జరపడం విశేషం. ఏప్రిల్ 13నే మిస్టర్ ను థియేటర్లలోకి తెచ్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇలా ఒక్క రోజు ప్రీపోన్ చేయడం వెనక రీజన్ ఏంటనే విషయం చెప్పలేదు కానీ.. మిస్టర్ మాత్రం ఏప్రిల్ 13నే వచ్చేయడం ఖాయమైంది.

లావణ్య త్రిపాఠి.. హేభా పటేల్ లు ఈ మూవీలో మెగా హీరోతో రొమాన్స్ చేయగా.. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ను ట్రయాంగిల్ లవ్ స్టోరీకి పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తూ.. శ్రీనువైట్ల ఈ ప్రేమకథను అందంగా తెరకెక్కించాడనే టాక్ ఉంది. ఇటు వరుణ్ తేజ్ తో పాటు.. అటు శ్రీను వైట్లకు కూడా ఈ చిత్రం విజయం సాధించడం చాలా ముఖ్యం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/