Begin typing your search above and press return to search.

డే 1: బాగా ఇంప్రూవ్ అవ్వాలి వరుణ్‌

By:  Tupaki Desk   |   15 April 2017 11:42 AM GMT
డే 1: బాగా ఇంప్రూవ్ అవ్వాలి వరుణ్‌
X
మెగా ఫ్యామిలీ నుండి వచ్చారంటే కచ్చితంగా అభిమానులు తొలిరోజున బంపర్ ఓపెనింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాని యంగ్ హీరో వరుణ్‌ తేజ్ మాత్రం తన అభిమానగణాన్ని బలపరుచుకునే విధంగా మాత్రం పావులు కదపట్లేదు. ఇప్పుడు ''మిష్టర్'' తొలిరోజు ఓపెనింగ్స్ చూస్తుంటే ఆ విషయం అర్ధమవుతోంది.

''లోఫర్'' సినిమాకు కూడా మొదటి షో పడగానే నెగెటివ్ టాక్ వచ్చేసింది కాని.. ఆ సినిమాకు వచ్చినంత ఓపెనింగ్ కూడా ''మిష్టర్'' సినిమాకు రాలేదు. తొలిరోజున లోఫర్ సినిమా రెండు రాష్ట్రాల నుండి 3.75 కోట్లు షేర్ వసూలు చేస్తే.. మిష్టర్ మాత్రం కేవలం రెండు రాష్ట్రాల నుండి 2.25 కోట్లు షేర్ వసూలు చేసింది. పేలవమైన ట్రైలర్లు.. శ్రీను వైట్ల మీద ప్రేక్షకులకు నమ్మకం సన్నగిల్లడం.. వెరసి వరుణ్‌ తేజ్ మార్కెట్ కు గట్టి దెబ్బనే కొట్టాయి. ఇకపోతే తొలివారంలో లోఫర్ 10 కోట్లు షేర్ వసూలు చేసి చేతులెత్తేసింది. మరి మిష్టర్ పరిస్థితి ఏంటి? ఏదేమైనా కూడా తొలిరోజు గాట్టి ఓపెనింగులు తెచ్చుకోవడంలో వరుణ్‌ బాగా ఇంప్రూవ్ అవ్వాల్సిందే.

చేతిలో శేఖర్ కమ్ముల ''ఫిదా'' సినిమా ఉందిలే కాని.. ఈ మధ్యన శేఖర్ కూడా ఫామ్ లో లేడు. కాబట్టి వరుణ్‌ చాలా జాగ్రత్తగా తన తదుపరి కథలను ఎంచుకుంటే బాగుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/