Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: యముడితో ఆట

By:  Tupaki Desk   |   4 July 2019 11:48 AM IST
ట్రైలర్ టాక్: యముడితో ఆట
X
చియాన్ విక్రమ్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న కడరమ్ కొండెన్ తెలుగులో మిస్టర్ కెకెగా వస్తోంది. దీని ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే గర్భవతి(అక్షర హాసన్)గా ఉన్న భార్యను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు తన భర్త(అబి హస్సన్). అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న క్రమంలో వీళ్ళ జీవితంలోకి ఓ మాఫియా ముఠా అడుగు పెడుతుంది. చేయకూడని ఘోరాలు అతనితో చేయించేందుకు సిద్ధపడుతుంది.

ఈ క్రమంలో అడుగుపెడతాడు మిస్టర్ కెకె(విక్రమ్). ఒకప్పుడు అండర్ కవర్ గా ఉండి తర్వాత డబుల్ ఏజెంట్ గా మారిన ఇతను మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉంటాడు. అసలు ఆ జంటకు జరుగుతున్న క్రైమ్ కు సంబంధం ఏమిటి అనేదే కథలోని కీలక పాయింట్. ఎక్కువ కథను రివీల్ చేయకుండా కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది

విక్రమ్ ఎప్పటిలాగే లుక్స్ తోనే అదరగొట్టాడు. గుబురు తెల్ల గెడ్డంతో ; కండలు తిరిగిన దేహంతో మాచో మ్యాన్ ను మీనింగ్ లా కనిపించాడు. అక్షర హాసన్ తో సహా మిగిలిన పాత్రలను ఎక్కువగా చూపించలేదు. ఆద్యంతం హాలీవుడ్ స్టాండర్డ్ లో రూపొందిన మిస్టర్ కెకె ఓ ఇంగ్లీష్ బ్లాక్ బస్టర్ ను స్ఫూర్తిగా తీసుకున్న ఛాయలు కనిపిస్తున్నాయి.

శ్రీనివాస్ ఆర్ గుత్తా ఛాయాగ్రహణం ఉన్నతంగా ఉంది. విజువల్స్ ని బంధించిన తీరు సింప్లీ సూపర్. ఎక్కువ సౌండ్ పొల్యూషన్ లేకుండా జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెన్నెముకగా నిలుస్తోంది. మొత్తానికి విక్రమ్ నుంచి చాలా కాలం తర్వాత ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతోంది. ఈ నెలలోనే విడుదల కాబోతున్న మిస్టర్ కెకె డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది