Begin typing your search above and press return to search.

వైరల్‌ : ప్రేక్షకులకు హీరోగారి థాంక్స్‌.. ఇదెక్కడి విడ్డూరం!

By:  Tupaki Desk   |   20 Dec 2022 3:30 PM GMT
వైరల్‌ : ప్రేక్షకులకు హీరోగారి థాంక్స్‌.. ఇదెక్కడి విడ్డూరం!
X
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ : మెవరిక్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రం కాసుల వర్షం కురిపించడంతో మరోసారి టామ్ క్రూజ్ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటినట్లయ్యింది.

సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హీరో టామ్ క్రూజ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు. తన సినిమా ను ఈ స్థాయిలో సక్సెస్ చేసినందుకు గాను కృతజ్ఞతలు అంటూ ఆయన చేసిన సాహసం అత్యంత విభిన్నమైన థాంక్స్ గా నిలిచి పోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తన సినిమా సక్సెస్ చేసినందుకు గాను ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు టామ్ క్రూజ్ ఏకంగా విమానం నుండి కిందికి దూకాడు. అతడు కిందికి దూకుతున్న సమయంలో ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు.

ఆ సందర్భంలో టాం క్రూజ్ మాట్లాడుతూ నేను ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో షూటింగ్‌ లో ఉన్నాను. ఇటీవల నేను నటించినా టాప్ గన్ సినిమా ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఎప్పుడూ అలరించేందుకు నేను ముందుంటాను.

ఇది నాకు జీవితకాలం కి దక్కిన గౌరవం. ప్రస్తుతం నేను ఎంతో ఎత్తులో ఉన్నాను. త్వరలో ఖచ్చితంగా మీ ముందుకు మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్నాను అంటూ విమానం నుండి కిందికి దూకుతూ వీడియో ని రికార్డ్ చేశాడు.

ఈయనను రియల్ హీరో అంటూ ఇందుకే పిలుస్తారు. అయితే కొందరు అభిమానులు మాత్రం థాంక్స్ చెప్పేందుకు మరీ ఇంతటి సాహసం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈ హీరో యొక్క సాహసం ప్రపంచ వ్యాప్తంగా గుర్తుండి పోతుందని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.