Begin typing your search above and press return to search.

మిస్సింగ్ థియేటర్స్ కే కరెక్ట్..

By:  Tupaki Desk   |   14 Nov 2021 9:30 AM GMT
మిస్సింగ్ థియేటర్స్ కే కరెక్ట్..
X
హర్షా నర్రా.. నికీషా రంగ్వాలా.. మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై శ్రీని జోస్యుల దర్శకత్వంలో భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్సింగ్ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సినిమాపై నమ్మకం వ్యక్తం చేస్తూ తమ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ...మిస్సింగ్ మూవీలో మిస్ అయ్యేది నేనే. కాబట్టి ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారు అనుకుంటున్నాను. ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మిస్సింగ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు నా క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది చెప్పుకొచ్చింది.

హీరో హర్షా నర్రా మాట్లాడుతూ... మా సినిమా థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసమే తెరకెక్కించాం. అందుకే ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపాం. ఖచ్చితంగా థియేటర్ లోనే ఈ సినిమా ప్రేక్షకులు చూడాలని కోరుకున్నాం. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది. థియేటర్ లోనే ఎందుకు అంటే... మిస్సింగ్ మూవీని థియేటర్ లో చూసే ఎక్సీపిరియన్స్ వేరుగా ఉంటుంది. మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్, మేకింగ్ థియేటర్స్ కే కరెక్ట్. కనుక ఓటీటీకి వెళ్లకుండా థియేటర్ రిలీజ్ కు సిద్దం చేశాం అన్నాడు.

దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ...కొత్త వాళ్లను ఆదరించడంలో మన ప్రేక్షకులు ముందుంటారు. మిస్సింగ్ చిత్రంతో మేము చేసిన ప్రయత్నాన్ని కూడా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మా మూవీలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. మంచి థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే చిత్రమిది. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. లేకుంటే మాకు చెప్పండి, లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండాలన్నదే మా కోరిక. ఈ నెల 19న థియేటర్ లలో మిస్సింగ్ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నాడు.