Begin typing your search above and press return to search.

కాలేజీకి వెళుతూ షాకిస్తున్న మాజీ మిస్ వ‌ర‌ల్డ్‌!

By:  Tupaki Desk   |   25 Feb 2019 4:39 AM GMT
కాలేజీకి వెళుతూ షాకిస్తున్న మాజీ మిస్ వ‌ర‌ల్డ్‌!
X
గ్లామ‌ర్ పీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప్ర‌యారిటీలు మారిపోతుంటాయి. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఆలోచ‌న‌ల‌కు పొంత‌న లేని నిర్ణ‌యాలు తీసుకోవ‌టం చాలామంది చేస్తుంటారు. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం చాలా కొద్ది మందే చేస్తుంటారు. ఇక‌.. ఎడ్యుకేష‌న్ మ‌ధ్య‌లో గ్లామ‌ర్ ఫీల్డ్ లో అడుగు పెట్టిన వారు మ‌ళ్లీ కాలేజ్.. పుస్త‌కాలు.. ప‌రీక్ష‌లు లాంటి వాటి జోలికి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అస‌లు అలా ఆలోచించ‌టానికి స‌మ‌యం చిక్క‌ని ప‌రిస్థితి.

అలాంటిది మిస్ వ‌రల్డ్ గా ఎంపికైన త‌ర్వాత‌.. గ్యాప్ తీసుకొని కాలేజీకి వెళ్ల‌టం మాజీ మిస్ వ‌ర‌ల్డ్ మానుషి చిల్లార్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత దేశానికి మిస్ వ‌రల్డ్ టైటిల్ తెచ్చిన ఘ‌న‌త ఆమె సొంతం. మిస్ వ‌ర‌ల్డ్ గా వ‌చ్చిన ఇమేజ్ తో ఆమెకు బోలెడ‌న్ని బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే.. ఆమె సినిమాల్లో న‌టించ‌లేదు కానీ చాలానే యాడ్స్ లో చేశారు.

త్వ‌ర‌లో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసే నిర్ణ‌యాన్ని ఆమె తీసుకున్నారు. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల స‌మ‌యంలో ఆమె ఆపిన మెడిసిన్ కోర్సును పూర్తి చేయ‌టానికి వీలుగా తాజాగా ముంబ‌యిలోని ఒక కాలేజీలో ఆడ్మిష‌న్ పొందారు. హ‌ర్యానాలోని సోనేప‌ట్ లోని ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో మానుషి ఎంబీబీఎస్ చ‌దివేవారు. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆమె మ‌ధ్య‌లో సెల‌వులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మానుషి తండ్రి ముంబ‌యికి బ‌దిలీకావ‌టంతో ఆమె కూడా త‌న చ‌దువును కొన‌సాగించేందుకు వీలుగా అనుమ‌తి తీసుకున్నారు.

గ‌తంలో తాను చ‌దివిన కాలేజీ నుంచి ఎన్ వోసీ తీసుకున్న ఆమె కొత్త కాలేజీలో ఆడ్మిష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మాజీ మిస్ వ‌రల్డ్ కావ‌టంతో ఆమె అప్లికేష‌న్ పెట్టిన ప‌దిహేను రోజుల‌కే కాలేజీలో ఆడ్మిష‌న్ ల‌భించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన త‌ర్వాతే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తార‌ని చెబుతున్నారు. గ్లామ‌ర్ ప్రపంచంలో స‌క్సెస్ సాధించ‌ట‌మే కాదు.. బిజీబిజీగా ఉన్న ఆమె ఇప్పుడు పుస్త‌కాల‌తో కాలేజీకి వెళ్ల‌టం అంద‌రిని స‌ర్ ప్రైజ్ కు గుర‌వుతుంది. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. మానుషిని మాత్రం అభినందించాల్సిందే.