Begin typing your search above and press return to search.

దీపికా పాట‌కు`చిల్ల‌ర్‌`స్టెప్పులు..వైర‌ల్ వీడియో!

By:  Tupaki Desk   |   25 Nov 2017 5:50 PM GMT
దీపికా పాట‌కు`చిల్ల‌ర్‌`స్టెప్పులు..వైర‌ల్ వీడియో!
X
చైనాలోని మాన్యాలో జ‌రిగిన మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌లో హ‌ర్యానాకు చెందిన మానుషి చిల్ల‌ర్ 2017 సంవ‌త్స‌రానికి గాను ప్ర‌పంచ సుంద‌రి కిరీటాన్ని కైవ‌సం చేసుకున్న సంగతి తెలిసిందే. 17 సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త్ కు మిస్ యూనివ‌ర్స్ కిరీటం తెచ్చిన మానుషి చిల్ల‌ర్ రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ అయిపోయింది. ప్ర‌స్తుతం మానుషి చిల్ల‌ర్ పేరు ఇంట‌ర్నెట్, సోష‌ల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె గురించిన వివ‌రాలు తెలుసుకోవ‌డానికి నెటిజన్తు విప‌రీత‌మైన ఆస‌క్తిని చూపుతున్నారు. ఆమె అందానికి కుర్ర‌కారు ఫిదా అయిపోయారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె అందం చూసి మంత్ర‌ముగ్దులైన‌ అభిమానుల‌ను ఓ వీడియో అల‌రిస్తోంది. చిల్ల‌ర్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి యూట్యూబ్ లో వైర‌ల్ అయింది.

మిస్ వ‌ర‌ల్డ్ పోటీల సంద‌ర్భంగా ప్ర‌తి కంటెస్టెంట్ త‌మ దేశ సంప్ర‌దాయాన్ని ప్ర‌తిబింబించే పాట‌కు డ్యాన్స్ చేయాలి. మానుషి చిల్ల‌ర్ త‌న‌ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కోసం 2013లో విడుద‌లైన `రామ్ లీల‌` చిత్రంలో న‌వ‌రాత్రి నేప‌థ్యంలో వ‌చ్చే ఓ పాట‌ను ఎంచుకుంది. దీపికా ప‌దుకొనే న‌ర్తించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాంగ్‌`న‌గాడా సంగ్ గ‌ర్బా`కు చిల్ల‌ర్ అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియోను మిస్ వ‌ర‌ల్డ్ పోటీల నిర్వాహ‌కులు అఫీషియ‌ల్ గా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఆ స్టెప్పుల‌కు నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. దీంతో, ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 2000 సంవ‌త్స‌రంలో ప్రియాంకా చోప్రా త‌ర్వాత భార‌త్ కు ప్ర‌పంచ సుంద‌రి టైటిల్ తెచ్చిన మానుషి చిల్ల‌ర్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే.