Begin typing your search above and press return to search.

మిస్‌ విజయవాడ.. మనసు దోచేస్తుంది

By:  Tupaki Desk   |   22 July 2015 11:01 AM IST
మిస్‌ విజయవాడ.. మనసు దోచేస్తుంది
X
సాంప్రదాయ కుటుంబం నుంచి తెలుగమ్మాయి ర్యాంప్‌ వాక్‌ లు చేయడమే అరుదు.. అనుకుంటే ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌ లే పుట్టుకొస్తున్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా తల్లిదండ్రుల్లోనూ మార్పులొస్తున్నాయి. అమ్మాయిల్ని అందాల పోటీలకు పంపిస్తున్నారు. మోడలింగ్‌ చేయమని ప్రోత్సహిస్తున్నారు. నటిస్తానంటే కండిషన్లు పెట్టడం లేదు. నచ్చిందే చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఈ ట్రెండ్‌ ఊపందుకుందనడానికి ఈ తెలుగమ్మాయే సాక్ష్యం.

ప్రఖ్యాత సంగీతజ్ఞుడు మంగళం పల్లి బాలమురళికృష్ణ ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయి కథానాయికగా టాలీవుడ్‌ కి పరిచయం అవుతోంది. పేరు శ్రీసత్య (18). ఇప్పటికే మూడు సినిమాలకు కమిటైంది. జీనియస్‌ ఫేం హవీష్‌ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే అవికా గోర్‌ తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది. సత్య ఓ బిజినెస్‌ మేన్‌ కూతురు. మంగళంపల్లి శ్రీనివాస్‌-మంగళంపల్లి లలిత దంపతులకు జన్మించిన బిడ్డ. బాలమురళి కృష్ణ శ్రీసత్యకు తాతగారు. విజయవాడ స్వస్థలం. చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది కానీ తొలి నుంచి అందంపై శ్రద్ధ ఎక్కువే. అదే అందాల పోటీల వైపు నడిపించింది. అలా ఈ ఏడాది ఏప్రిల్‌ లో జరిగిన మిస్‌ విజయవాడ కాంపిటీషన్‌ లో కిరీటం అందుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కెరీర్‌ ఎంచుకుంది.

ప్రస్తుతం విజయవాడ లో బిబిఎ చదువుతోంది. పోలీస్‌ కి సంబంధించిన కొన్ని లఘుచిత్రాల్లోనూ నటించింది. ఇదీ సత్య నేపథ్యం. ఫ్యామిలీ సభ్యులు, స్నేహితుల నుంచి మొదట ప్రోత్సాహం రాలేదు. కానీ అమ్మా నాన్న సపోర్టు తో నటన లోకి వచ్చానని శ్రీసత్య చెబుతోంది. కలర్స్‌ స్వాతి, శ్రీదివ్య, బిందుమాధవి రేంజులో శ్రీసత్య అన్ని పరిశ్రమల్లోనూ పాపులర్‌ కావాలని ఆశిద్దాం