Begin typing your search above and press return to search.

అనంతపురం అమ్మాయికి అందాల కిరీటం

By:  Tupaki Desk   |   18 Feb 2020 1:15 PM IST
అనంతపురం అమ్మాయికి అందాల కిరీటం
X
అందాల పోటీల్లో పాల్గొనేందుకు చాలా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండాలి.. మోడలింగ్‌ లో రాణించాలి ఇంకా చాలా చాలా అర్హతలు ఉండాలని అంతా అనుకుంటారు. కాని బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా అందాల పోటీల్లో గెలిచేందుకు అందం తెలివి తేటలు ఉంటే చాలని అనంతపురం అమ్మాయి సుగమ్య నిరూపించింది. ఆమె సౌత్‌ ఇండియన్‌ బ్యూటీ కాంటెస్ట్‌ లో వందల మంది పోటీ పడగా వారందరిని వెనక్కు నెట్టి విజేత గా నిలిచింది. మద్య తరగతి కుటుంబం నుండి వచ్చిన సుగమ్య సౌత్‌ ఇండియా 2020 అందాల పోటీ విజేతగా నిలిచి కిరీటంను దక్కించుకుంది. పలు దశల్లో సాగిన ఈ కాంటెస్ట్‌ లో అన్నింటిని దాటుకుంటూ ఈమె విన్నర్‌ అయ్యింది.

సౌత్‌ ఇండియా 2020 అందాల పోటీలో విజేతగా నిలిచిన తర్వాత ఈమె మాట్లాడుతూ భవిష్యత్తు లో మిస్‌ ఇండియా.. మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. విజేత గా నిలిచిన సుగమ్యకు తెలుగు.. తమిళ.. కన్నడ భాషల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నట్లుగా చెప్పింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి హీరోయిన్‌ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లుగా ఆమె చెప్పించి. త్వరలోనే ఏదో ఒక సినిమాకు సుగమ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంకా సుగమ్య మాట్లాడుతూ.. మాది అనంతపురం జిల్లా పెనుగొండ. నాన్న రవిశంకర్‌ యోగా గురువు. అమ్మ గాయత్రి గతంలో పలు సినిమాల్లో నటించారు. నా చదువు పెనుగొండ.. హైదరాబాద్‌.. బెంగళూరు.. చెన్నై లో సాగింది. ప్రస్తుతం భరత నాట్యంలో ఎంఏ చదువుతున్నాను. ఇదే సమయం లో మహారాష్ట్ర లో గురుకుల పాఠశాలలో భరతనాట్య టీచర్‌ గా పని చేస్తున్నాను. చిన్నప్పటి నుండి భరతనాట్యంపై ఉన్న ఆసక్తి తో నేర్చుకున్నాను. నాకు నా తల్లిదండ్రులు.. అన్నయ్య.. స్నేహితులు ప్రతి విషయంలో చాలా సపోర్ట్‌ గా నిలిచారు. వారి సహకారంతోనే ఈ స్థాయి లో ఉన్నాను అంటూ సుగమ్య చెప్పుకొచ్చింది.