Begin typing your search above and press return to search.

పీసీని ఫాలో అవుతున్న మిస్ యూనివ‌ర్శ్

By:  Tupaki Desk   |   14 Dec 2021 4:30 PM GMT
పీసీని ఫాలో అవుతున్న మిస్ యూనివ‌ర్శ్
X
అందాల పోటీల్లో గ‌త కొన్నేళ్లుగా భార‌తీయ సుంద‌రీమ‌ణుల హ‌వా త‌గ్గిపోయింద‌నే విమ‌ర్శ ఉంది. మానుషి చిల్ల‌ర్ త‌ర్వాత వేరొక పేరు ఏదీ వినిపించ‌లేదు. అయితే సైలెంట్ గా దూసుకొచ్చింది పంజాబీ అమ్మాయి .. చండీఘ‌ర్ బ్యూటీ హ‌ర్నాజ్. మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు భారతదేశానికి టైటిల్ ని అందించింది. 21 సంవత్సరాల తర్వాత ఈ అవ‌కాశం ద‌క్కింది. పంజాబీ యువ మోడల్ మిస్ యూనివర్స్ టైటిల్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

ఇజ్రాయెల్ లోని ఐలాట్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో హర్నాజ్ సంధు కిరీటాన్ని అందుకుంది. హర్నాజ్ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత గ‌త ఫోటోషూట్ల నుంచి వ‌రుస ఫోటోల‌ను షేర్ చేసింది. వీటిలో రెడ్ హాట్ బికినీల‌తో చెల‌రేగిన‌వి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

హర్నాజ్ సంధు గతంలో LIVA మిస్ దివా యూనివర్స్ 2021 ..ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 వంటి అనేక పోటీల‌లో టైటిల్స్ కైవశం చేసుకుంది. ఆమె యారా దియాన్ పూ బరన్ .. బాయి జీ కుట్టాంగే వంటి పంజాబీ చిత్రాలలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. మిస్ యూనివ‌ర్శ్ కిరీటం ద‌క్కింఉకోక ముందే సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిస్సు తొంద‌ర‌లోనే టాలీవుడ్ లోనూ అడుగుపెట్టేందుకు ఛాన్సుంది. మాజీ మిస్ వ‌రల్డ్ ప్రియాంక చోప్రా స్ఫూర్తితో స్కై ఈజ్ లిమిట్ అన్న‌చందంగా ఎదిగేస్తాన‌ని హార్మాజ్ క‌ల‌లు గంటోంది.