Begin typing your search above and press return to search.

మిస్ యూనివర్స్ పోటీ.. మోసం దగా అంటోంది

By:  Tupaki Desk   |   23 Dec 2015 9:30 AM GMT
మిస్ యూనివర్స్ పోటీ.. మోసం దగా అంటోంది
X
అందాల పోటీలంటేనే పెద్ద గ్యాంబ్లింగ్ అన్న అభిప్రాయం ఉంది. విజేతను ప్రకటించడంలో అనేక మతలబులుంటాయని అంటారు ఆ ఫీల్డ్ కు సంబంధించిన వ్యక్తులు. ఐతే అంతర్గత వ్యవహారాల గురించి పైకి మాట్లాడ్డం తక్కువ. ఐతే ఈసారి మిస్ యూనివర్స్ ను ప్రకటించే సమయంలో జరిగిన డ్రామా ఈ పోటీల మీద అనేక సందేహాలు రేకెత్తించింది. ముందు మిస్ కొలంబియా అరియానా గ్విటెరెజ్ ను విజేతగా ప్రకటించడం.. ఆ తర్వాత పొరబాటైందని చెప్పి.. మిస్ ఫిలిప్పీన్స్ వర్చ్ బాక్ కు టైటిల్ అందించడం తెలిసిందే. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిన డ్రామా అన్న ఆరోపణలున్నాయి. మన దేశం నుంచి ఈ పోటీలకు వెళ్లి ఊర్వశి రౌతెలా మాటల్ని బట్టి చూస్తుంటే ఈ ఆరోపణలే నిజమని అర్థమవుతోంది. మొత్తంగా ఈ పోటీలే పెద్ద మాయాజాలం.. అక్కడ జరిగేదంతా మోసమేనని ఆరోపిస్తోంది ఊర్వశి.

మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్-15లో కూడా చోటు దక్కించుకోలేకపోయిన ఊర్వశి.. నిర్వాహకులు కావాలని తనని పక్కనబెట్టారంటోంది. అక్కడంతా పక్షపాత నిర్ణయాలే జరిగాయని ఆమె ఆరోపిస్తోంది. తాను ఆరంభ రౌండ్లలో స్విమ్ వేర్, ఈవెనింగ్ గౌన్, ఇంటర్వ్యూ విభాగాల్లో చాలా బాగా పెర్ఫామ్ చేశానని.. ఐతే తనకు కనీసం టాప్-15లో కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఊర్వశి చెప్పింది. వచ్చే ఏడాది పోటీలు ఫిలిప్పీన్స్ లో జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అమ్మాయినే విజేతగా ప్రకటిస్తే మార్కెటింగ్ కు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నిర్వాహకులు జడ్జీల మీద ఒత్తిడి తెచ్చారని.. విజేతను ప్రకటించే విషయంలో జరిగిన డ్రామా కూడా ప్రి ప్లాన్డ్ గా జరిగిందే అని ఊర్వశి కుండ బద్దలు కొట్టింది. మరి ఊర్వశి ఆరోపణలకు నిర్వాహకులు ఏమని బదులిస్తారో?