Begin typing your search above and press return to search.

చరణ్ అన్నయ్యతో మిస్ ఇండియా వరల్డ్

By:  Tupaki Desk   |   5 April 2019 12:06 PM IST
చరణ్ అన్నయ్యతో మిస్ ఇండియా వరల్డ్
X
రామ్ చరణ్ వినయ విధేయ రామలో హీరో అన్నయ్యగా ఎలక్షన్ ఆఫీసర్ గా నటించిన ప్రశాంత్ ఇక్కడ మార్కెట్ లేదు కాబట్టి సపోర్టింగ్ రోల్ ఒప్పుకున్నాడు కాని తమిళ్ లో ఇంకా హీరో వేషాలు వేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు శంకర్ జీన్స్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఇక్కడా మార్కెట్ ఏర్పరుచుకున్న ప్రశాంత్ ఆ తర్వాత దాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయాడు. అయితే తమిళ్ లో చేసే సినిమాల్లో అందరూ హాట్ బ్యూటీస్ నటించేలా చేసుకోవడం ఇతని స్పెషాలిటి.

జీన్స్ లో విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ తో మొదలుకుని టాప్ హీరొయిన్స్ ఆడిపాడాడు. ఇప్పుడు తాజాగా 2018 మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుని మిస్ వరల్డ్ పోటీలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అనుక్రీతి వాస్ ను కొత్త మూవీలో హీరొయిన్ గా బుక్ చేయించాడు.

గతంలో ఇదే హీరోతో చాకొలేట్ రూపొందించిన వెంకటేష్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇందులో ఆసక్తికరమైన స్టార్ క్యాస్ట్ ఉంది. ప్రశాంత్ అక్కయ్యగా భూమిక విలన్ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. జయసుధ నాజర్ నరేన్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా ఉన్నారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడే యాక్షన్ పాత్రతో ప్రశాంత్ ఫుల్ మాస్ రోల్ చేస్తున్నాడట.

ఇక్కడేమో మన హీరోలకు ఏజ్ బార్ అన్నయ్యగా కనిపించే తమిళ హీరోలు అక్కడ మాత్రం క్రేజీ బ్యూటీస్ తో డ్యూయెట్స్ పాడుకోవడం విశేషమే. వినయ విధేయ రామ హిట్ అయ్యుంటే ఇలాంటివి డబ్బింగ్ రూపంలో వచ్చేవి కాని ప్రశాంత్ మార్కెట్ కు అది ఏ మాత్రం ఉపయోగపడలేదు సరికదా ఆ పాత్రే సోషల్ మీడియా ట్రాలింగ్ కి గురయ్యింది.