Begin typing your search above and press return to search.

ఈ చిన్నది ఏం చేసుంటుంది??

By:  Tupaki Desk   |   2 May 2017 12:30 AM GMT
ఈ చిన్నది ఏం చేసుంటుంది??
X
బాహుబలి సెన్సేషన్ కంటిన్యూ అవుతున్నా.. ధైర్యంగా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్న సినిమా బాబు బాగా బిజీ. శ్రీనివాస్ అవసరాల హీరో పాత్రలో నటించగా.. మిస్తీ చక్రవర్తి.. తేజస్వి మదివాడ.. సుప్రియ.. శ్రీముఖిలు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ మూవీ హంటర్ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎడల్ట్ టచ్ బాగా ఉంది కాబట్టి.. బాహుబలి టిక్కెట్లు దొరకని జనాలు ఈ ధియేటర్లకు వచ్చేస్తారని ఫీలింగ్ కాబోలు.

ఈ సినిమా గురించి మిస్తీ చక్రవర్తి మాట్లాడుతూ.. 'హిందీలో రాధికా ఆప్టే చేసిన రోల్ ను తెలుగులో నేను చేశాను. నా పాత్ర పేరు రాధ. రాధిక లాంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ చేసిన పాత్ర కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. ఒరిజినల్ నుంచి థీమ్ తీసుకున్నా.. కొత్తగా రూపొందించాలనే ప్రయత్నించారు. దర్శకుడు చెప్పినపుడే నా పాత్ర కొత్తగా అనిపించింది. ప్రతీ సినిమాకి నా రోల్ కొత్తగా చేయాలనే నా ఆలోచనకు తగినట్లుగానే బాబు బాగా బిజీలో నా రోల్ ఉంటుంది. అందుకనే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నాను' అని చెప్పింది మిస్తీ చక్రవర్తి.

హిందీలో గ్రాండ్ గా సుబాష్‌ ఘాయ్ సినిమాతో లాంచింగ్ అయిన ఈ చిన్నది.. తెలుగులో ''చిన్నదానా నీకోసం'' అంటూ నితిన్ సినిమాతో వచ్చింది. ఆ సినిమాలో గ్లామర్ ఆరబోత తప్పిస్తే.. అసలు పాత్రలోపరకాయ ప్రవేశం చేసిందే లేదు. మరి ''బాబు బాగా బిజీ''లో ఈవిడ ఏం చేసుంటుందో??

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/