Begin typing your search above and press return to search.
'Mishan Impossible' ఫస్ట్ లుక్ పోస్టర్ వివాదం..!
By: Tupaki Desk | 13 Dec 2020 8:40 AM IST'ఏజెంట్ సాయి శ్రీనివాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ ఆర్ఎస్ జె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో రెండో సినిమాగా 'మిషన్ ఇంపాజిబుల్’ అనే వైవిధ్యమైన టైటిల్ తో అనౌన్స్ చేశాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. Mission impossible అనే పదాన్ని ఇస్తూనే.. అందులోని Mission లో sio అనే అక్షరాలను కొట్టేసి ha అనే అక్షరాలతో Mishan Impossible గా మార్చేశారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం వివాదానికి దారి తీసింది.
'Mishan Impossible' ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముగ్గురు పిల్లలను హిందూ దేవుళ్లయిన ఆంజనేయస్వామి - శివుడు - శ్రీకృష్ణుడు గెటప్స్ లో చూపిస్తూ వారి చేతుల్లో గన్స్ పట్టించారు. వినూత్నమైన ఈ పోస్టర్ వివాదాస్పదమైంది. హిందూ దేవుళ్ళ వేషధారణలతో ఉన్న చిన్న పిల్లల చేతుల్లో తుపాకీలు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచారని.. సినిమా మేకర్స్ పై కేసులు నమోదు చేయాలని ట్వీట్స్ పెట్టారు. ఐతే ఈ ఇష్యూ ఇంకా పెద్దది అవుతుందేమో అని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ పై క్లారిఫికేషన్ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
'మిషన్ ఇంపాజిబుల్' ఫస్ట్ లుక్ పోస్టర్ పై వ్యక్తమైన అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయని.. సమాజంలోని ఏ వర్గం యొక్క ఫీలింగ్స్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ పోస్టర్ డిజైన్ చేయలేదని.. అనుకోకుండా జరిగిన ఈ విషయానికి చింతిస్తూ ఆ పోస్టర్ ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని మేకర్స్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ వివరణతో కూడా నెటిజన్స్ చల్లబడలేదు. మేకర్స్ కి వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.