Begin typing your search above and press return to search.

మీర్జాపూర్‌ 3 ఉండక పోవచ్చు

By:  Tupaki Desk   |   12 Nov 2020 4:00 PM GMT
మీర్జాపూర్‌ 3 ఉండక పోవచ్చు
X
యూత్‌ ఆడియన్స్‌ లో విపరీతమైన క్రేజ్‌ ఉన్న మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సీజన్‌ ఘన విజయం సాధించడంతో రెండవ సీజన్‌ తీసుకు వచ్చారు. మొదటి సీజన్‌ మాదిరిగానే రెండవ సీజన్‌ కూడా దేశ వ్యాప్తంగా యూత్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అమెజాన్‌ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ మరీ మాస్‌ గా పచ్చి బూతులతో శృతి మించిన అడల్ట్‌ కంటెంట్‌ తో మరీ దారుణమైన హింసాత్మక సన్నివేశాలతో సాగుతుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీర్జాపూర్‌ కు వస్తున్న రెస్పాన్స్‌ నేపథ్యంలో మూడవ సీజన్‌ కు కూడా స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది.

షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఓటీటీ కంటెంట్‌ సెన్సార్‌ నిబంధనలు వర్తింపజేయబోతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. దాంతో సీజన్‌ 3 తీయడం కష్టం అవుతుంది. మీర్జా పూర్ ను క్లీన్‌ గా చేస్తే ప్రేక్షకులు ఒప్పుకునే అవకాశం లేదు. అంటే బూతులు లేకుండా అడల్ట్‌ కంటెంట్‌ అనేది లేకుండా తీయడం వల్ల ప్రేక్షకులు ఆధరించే అవకాశం తక్కువ. అందుకే పూర్తిగా వెబ్‌ సిరీస్‌ ను పక్కకు పెట్టేయడం ఉత్తమం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్‌ నిబంధనల విషయంలో మరింత స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని మీర్జాపూర్‌ మేకర్స్‌ భావిస్తున్నారు.