Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ అడల్ట్‌ వెబ్‌ సిరీస్‌ 3వ పార్ట్‌ ఆగలేదు

By:  Tupaki Desk   |   13 Nov 2020 9:45 AM IST
సూపర్‌ హిట్‌ అడల్ట్‌ వెబ్‌ సిరీస్‌ 3వ పార్ట్‌ ఆగలేదు
X
2018 నవంబర్‌ లో అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీర్జాపుర్‌ వెబ్‌ సిరీస్‌ సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. యూత్‌ ఆడియన్స్‌ ను ముఖ్యంగా అడల్ట్‌ కంటెంట్‌ లవర్స్‌ ను ఎక్కువగా ఆకట్టుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఇండియాలో వెబ్‌ సిరీస్‌ లకు భారీ క్రేజ్‌ ను తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. అద్బుతమైన కథ మరియు కథనంతో పాటు యూత్‌ ఆడియన్స్‌ ను ఎట్రాక్ట్‌ చేసే ఎలిమెంట్స్‌ పుష్కలంగా జొప్పించి రూపొందించారు. మొదటి సీజన్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ సీజన్‌ ను తీసుకు వచ్చారు.

మీర్జాపూర్‌ 2 ఇటీవలే పూర్తి అయ్యింది. మొదటి సీజన్‌ మాదిరిగా రెండవ సీజన్‌ కూడా మంచి టాక్‌ దక్కించుకుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓటీటీ కంటెంట్‌ కు సెన్సార్‌ నిర్వహించే విషయమై పరిశీలిస్తున్నట్లుగా ప్రకటన చేయడంతో మీర్జాపూర్‌ 3 రాకపోవచ్చు అన్నారు. అంటే మీర్జాపూర్‌ రెండు సీజన్‌ లకు సెన్సార్‌ చేస్తే మిగిలేది ఏమీ ఉండదు. ఇప్పుడు మూడవ సీజన్‌ ను సాదా సీదాగా చేస్తే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోక పోవచ్చు. అందుకే మీర్జాపూర్‌ 3 ఉండే అవకాశం లేదు అంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెజాన్‌ వారు స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేస్తూ మీర్జాపూర్‌ 3 ని ప్రకటించారు. అతి త్వరలోనే మీర్జాపూర్‌ 3 షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.. వర్క్‌ ఏమీ ఆగకుండా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.