Begin typing your search above and press return to search.

అక్టోబర్ 23న రిలీజ్ కానున్న 'మీర్జాపూర్-2' సిరీస్..!!

By:  Tupaki Desk   |   24 Aug 2020 5:48 PM GMT
అక్టోబర్ 23న రిలీజ్ కానున్న మీర్జాపూర్-2 సిరీస్..!!
X
డిజిటల్ ప్రపంచంలో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్‌’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా మీర్జాపూర్ సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తూ ఉన్నారు. లాక్‌డౌన్‌లో కూడా సోషల్ మీడియాలో మీర్జాపూర్ సిరీస్ గురించి చర్చలు నడిచాయి. అభిమానుల అంచనాలను అందుకుంటూ.. అమెజాన్ ప్రైమ్ వారు మీర్జాపూర్ సీజన్ 2 టీజర్ విడుదల చేస్తూ స్ట్రీమింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అక్టోబర్ 23 నుంచి ‘మీర్హాపూర్ 2’ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్లు తెలిపింది. పంకజ్ త్రిపాఠి - దివ్యేందు శర్మ - అలీ ఫజల్ - శ్వేత త్రిపాఠి ప్రధాన పాత్రలలో కనిపించనున్న మీర్జపూర్ సిరీస్‌ ను గుర్మీత్ సింగ్ - మిహిర్ దేశాయ్ డైరెక్ట్ చేయగా ఎక్సెల్ మీడియా ఎంటర్‌ టైన్ మెంట్ నిర్మించింది. ఇక మీర్జాపూర్ సీసన్ 2 ద్వారా భారతీయ ప్రామాణికతను కోల్పోకుండా ఉత్కంఠ భరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాత రితేష్ సిద్వాని తెలిపారు.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మీర్జాపూర్ సిరీస్ మంచి ఆదరణతో పాటు ప్రశంసలు అందుకోవడం.. మాకు ఎంతో సంతోషంతో పాటు మరింత బాధ్యతను పెంచాయని - మీర్జాపూర్-2 ద్వారా ప్రేక్షకుల అంచనాలకు మించి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇక మీర్జాపూర్ మొదటి సీజన్ ఎండింగ్‌ లో గుడ్డు సోదరుడు బబ్లూ - భార్య స్వీటీని చంపడం ద్వారా గుడ్డు జీవితాన్ని నాశనం చేస్తాడు మున్నా. ఇప్పుడు గుడ్డు ప్రస్తుత పరిస్థితిని తెలుపుతూ మీర్జాపూర్ 2 టీజర్ డిజైన్ చేశారు మేకర్స్. ‘ప్రపంచం రెండు రకాల మనుషులతో విడిపోయింది. ఒకరు బతికి ఉన్నవారైతే.. మరొకరు చనిపోయిన వారు. కానీ గుడ్డు మూడో కేటగిరీకి చెందినవాడు.. అదే దెబ్బతిన్నవాడు’ అంటూ గుడ్డు రివేంజ్ స్టోరీని సెకండ్ సీజన్‌‌ లో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా ఆసక్తి రేపారు మేకర్స్.