Begin typing your search above and press return to search.

తంబీలకు ఆ పాశం బాగా పట్టుకుంది

By:  Tupaki Desk   |   19 Feb 2016 3:30 PM GMT
తంబీలకు ఆ పాశం బాగా పట్టుకుంది
X
యమపాశం.. తెలుగులో ఈ వారమే విడుదలైన ఓ మూవీ ఇది. జయం రవి - లక్ష్మీ మీనన్ లు జంటగా నటించిన కోలీవుడ్ మూవి ఇది. తాజాగా తమిళనాట విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ట్ చేసిన తని ఒరువన్ ఒరిజినల్ లో నటించినది ఈ హీరోనే. అందుకే ఇప్పుడు జయం రవి సినిమాని డైరెక్టుగా విడుదల చేశారు.

ఇక్కడ టాక్ విషయంలో అంత బాగా క్లిక్ కాలేకపోయినా.. తమిళనాట మాత్రం మంచి హైప్ వచ్చింది. మురుదన్ మూవీకి ముందు తని ఒరువన్ బ్లాక్ బస్టర్ ఉండడం కూడా బాగా కలిసొచ్చింది. జాంబీలను ఇండియన్ తెరపైకి తెచ్చిన మూవీ కావడంతో.. ఇంట్రెస్టింగ్ టాపిక్ ని డైరెక్టర్ డీల్ చేసిన తీరుపై ప్రశంసలు వస్తున్నాయి. తమ వెయ్యికి పైగా ఎఎఫ్ ఎక్స్ షాట్స్ ఉంటాయని .. కానీ ఇందులో 10-15 తప్ప మిగిలినవాటిని గుర్తు పట్టడం సాధ్యం కాదని సవాల్ చేస్తున్నడు. దర్శకత్వం వహించిన శక్తి సౌందర రాజాకు కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు శవాలను కాల్చేసే కాన్సెప్ట్ తంబీలకు బాగా ఎక్కింది అంటున్నారు.

ఇలా ఓ హాలీవుడ్ రేంజ్ కాన్సెప్టును ఇండియన్ ఆడియన్స్ కు సరిపడేలా తీయడమంటే సాహసం అనే చెప్పాలి. కానీ దాన్ని సుసాధ్యం చేసింది మురుదన్ టీం. జయం రవి - లక్ష్మీ మీనన్ ల యాక్టింగ్ స్కిల్స్ - టెరిఫిక్ సన్నివేశాలు ఈ మూవీ హైలైట్ గా చెప్పచ్చు.