Begin typing your search above and press return to search.
ఆదాయపన్ను శాఖకు చిక్కిన తాప్సీ.. కాపాడాలంటూ మంత్రిని సాయం అడిగిన బోయ్ ఫ్రెండ్!
By: Tupaki Desk | 5 March 2021 11:00 PM ISTకథానాయిక తాప్సీ సహా అనురాగ్ కశ్యప్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ దాడుల గురించి తెలిసిందే. సుమారు 650 కోట్ల రూపాయల అవకతవకలను ఐటి శాఖ కనుగొన్నట్లు నిన్న సాయంత్రం కథనాలు వెలువడడడం సంచలనమైంది. 5కోట్ల రిసీప్ట్ లకు సంబంధించిన తాప్సీ వద్ద ఏదీ క్లారిటీ లేదని ఈ దాడులు వెల్లడించాయి.
అయితే తాప్సీ ఆపదలో పడిందని తెలియగానే ఆమె బోయ్ ఫ్రెండ్ అయిన క్రీడాకారుడు మాథియాస్ బో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ని సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు.
``ఏదో గందరగోళంగా ఉంది. కొందరు గొప్ప అథ్లెట్లకు కోచ్ గా మొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సమయంలో ఐటీ విభాగం తాప్సీ ఇంటిపై దాడి చేస్తోంది. ఆమె కుటుంబంపై ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతోంది. కిరెన్‌రిజిజు దయచేసి ఏదైనా చేయండి`` అని మాథియాస్ ట్వీట్ చేశారు.
అయితే దానికి మంత్రిగారు అంతే నింపాదిగా సమాధానం ఇవ్వడం బయటపడింది. ఇంతకీ మంత్రివర్యులు ఏమన్నారు? అంటే..``చట్టం అనేది బలమైనది. దానికి కట్టుబడి ఉండాలి. మీ కంటే నా కంటే కూడా అది ఎంతో గొప్పది. భారతీయ క్రీడల్లో ఉత్తమ ఆసక్తి కోసం మేము మా వృత్తిపరమైన విధులకు కట్టుబడి ఉండాలి`` అని మంత్రి కిరెన్ రిజిజు రిప్లయ్ ఇచ్చారు. ఈ సంభాషణల్ని బట్టి కేంద్రమంత్రి సాయం చేయగలిగే స్థాయిలో ఉన్నా కానీ ఐటీ దాడుల వ్యవహారంలోలో జోక్యం చేసుకోలేరనేది స్పష్టమైంది.