Begin typing your search above and press return to search.
కేటీఆర్ వెనుక పడ్డ ఓటీటీ లు ఫిల్మ్ మేకర్స్
By: Tupaki Desk | 24 July 2022 10:35 AM ISTతెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడు పార్టీ వ్యవహారాలు మరియు పరిపాలన వ్యవహారాలతో బిజీ బిజీగా ఉంటారు. ప్రతి రోజు మీటింగ్స్... పనులతో బిజీ బిజీగా ఉండే కేటీఆర్ ఇటీవల కాలికి చిన్న గాయం అయిన విషయం తెల్సిందే. ఆయన కాలికి అయిన గాయం తో మూడు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో ఈ సమయంలో ఓటీటీ సినిమాలు వెబ్ సిరీస్ లు ఏమైనా సజెస్ చేయండి అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.
కేటీఆర్ ట్వీట్ కు అనూహ్య స్పందన వచ్చింది. వందల సంఖ్యలో ఓటీటీ సినిమా లు వెబ్ సిరీస్ లు ఇంకా యూట్యూబ్ సిరీస్ లకు సంబంధించిన లింక్స్ ను ఆయనకు షేర్ చేయడం జరిగింది. జీ 5 ఓటీటీ వారు.. కేటీఆర్ గారు, ఉదయం మా నీళ్ల ట్యాంక్ తో స్టార్ట్ చేసి.. రెక్కీ తో థ్రిల్ అవుతూ లంచ్ టైమ్ కు ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కంప్లీట్ చేసి రాత్రికి ఆర్ ఆర్ ఆర్ చూసేయండి అంటూ ట్వీట్ చేశారు.
ఇక మంచు లక్ష్మి కూడా కూడా కేటీఆర్ కు ఈ ఫ్రీ టైం పాస్ కు సలహా ఇచ్చారు. గెట్ వెల్ సూన్... నా యొక్క అన్ని సినిమాలు చూడండి అంటూ స్మైల్ ఈమోజీ ని షేర్ చేసింది. ఆమె ట్వీట్ ను నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు అది వేరే విషయం.
ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కూడా తమ రివేంజ్ పొలిటికల్ డ్రామా 'పరంపర' చూస్తూ ఈ సమయం ను గడపండి అంటూ లింక్ ను కూడా షేర్ చేసింది. గాడ్సే తో పాటు ఇంకా పలు సినిమాలను కూడా కేటీఆర్ కు సూచిస్తున్నారు. పలు యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా కేటీఆర్ కు తమ సిరీస్ ను చూడండి అంటూ ట్వీట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు వెబ్ సిరీస్ ల యొక్క లింక్స్ ను షేర్స్ చేస్తున్నారు.
తెలుగు భాష వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు మాత్రమే కాకుండా వివిధ భాషలకు చెందిన వెబ్ సిరీస్ లను మరియు సినిమా లను కూడా కేటీఆర్ కు చాలా మంది సూచిస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్ మరియు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వారు కేటీఆర్ ట్వీట్ కు రెస్పాండ్ అవుతూ మా సినిమా లు.. మా వెబ్ సిరీస్ లను చూడండి అంటూ వెంట పడుతున్నారు. మరి కేటీఆర్ ఇన్ని సలహాల్లో నుండి వేటిని పిక్ చేసుకుని స్ట్రీమింగ్ చేస్తున్నారో...!