Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' నుంచి మినీ సర్ప్రైజ్..!

By:  Tupaki Desk   |   10 March 2021 11:56 AM GMT
ఏక్ మినీ కథ నుంచి మినీ సర్ప్రైజ్..!
X
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్.. అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా 'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా పెట్టి ''ఏక్ మినీ కథ'' అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధాదాస్ - కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవలే కూడా విడుదలైంది. ‘డజ్ సైజ్ మ్యాటర్?’ అంటూ వచ్చిన ఈ వైవిధ్యమైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో ఓ మినీ సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అయింది.

'ఏక్ మినీ కథ' టీజర్ ని మహా శివరాత్రి కానుకగా రేపు గురువారం ఉదయం గం. 9.30 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. అసలు ఈ సైజ్ మ్యాటర్ ఎంటనేది టీజర్ లో తెలిసే అవకాశం ఉంది. కాగా, 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ 'ఏక్ మినీ కథ' సినిమాకు కథ అందించాడు. కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తుండగా.. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.