Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ : టాప్ గేర్‌

By:  Tupaki Desk   |   30 Dec 2022 12:22 PM GMT
మినీ రివ్యూ : టాప్ గేర్‌
X
స‌క్సెస్ పెయిల్యూర్స్ తో సంబంధిం లేకుండా విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్‌. ప్రేమ కావాలి, ల‌వ్ లీ వంటి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. గ‌త కొంత కాలంగా స‌క్సెస్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని చూస్తున్నాడు. ఆది సాయికుమార్ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `టాప్ గేర్‌`. రియా సుమ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీకి కె. శ‌శికాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

కెవి శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిర్మించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ డిసెంబ‌ర్ 30న ప్రేక్ష‌క‌ల ముందుకొచ్చింది. ఆది సాయికుమార్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ ఎలా వుంది? .,. ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుందా?.. ఆదికి ఆశించిన విజ‌యాన్ని అందించిందా?.. ప‌బ్లిక్ టాక్ ఏంటీ?.. ఇంత‌కీ క‌థేంటీ?..గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆదికి ఈ మూవీ ఊర‌ట క‌లిగించిందా? అనే విష‌యాల్ని ఇప్పుడు చూద్దాం. బ్ర‌హ్మాజీ, మైమ్ గోపీ, శ‌త్రు, స‌త్యం రాజేష్‌, బెన‌ర్జీ, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థేంటీ?.. అర్జున్ (ఆది సాయికుమార్) ఓ క్యాబ్ డ్రైవ‌ర్..ఆద్య (రియా సుమ‌న్‌) ను పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని సాగిస్తుంటాడు. సిద్ధార్ధ్ (మైమ్ గోపీ) డ్ర‌గ్ పెడ్ల‌ర్‌. సిటీలో డ్ర‌గ్స్ రాకెట్ ని ర‌న్ చేస్తూ వుంటాడు. ఎప్ప‌టి క‌ప్పుడు పోలీసుల‌కు దొర‌క్కుండా డ్ర‌గ్స్ దందా న‌డుపుతుంటాడు. ఇదిలా వుంటే డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా అర్జున్ కు మ‌రో బుకింగ్ ఆర్డ‌ర్ వ‌స్తుంది. ఇద్ద‌రు వ్య‌క్తులు క్యాబ్ బుక్ చేసుకోవ‌డంతో వారి కోసం అర్జున్ వెళ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ఆ రాత్రి అర్జున్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది?.. అనుహ్య సంఘ‌ట‌న‌ల నుంచి అర్జున్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు?.. అత‌ని క‌థ ఎలా సుఖాంత‌మైంది అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

ఫ‌స్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగ‌గా సినిమాకు `అర్జున్ రెడ్డి` ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ రామేశ్వ‌ర్ అందించిన నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన హైలైట్ గా నిలిచి సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారింది. ఇక సెకండ్ హాఫ్.. ఊహించే స‌న్నివేశాలు, ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా సాగే క‌థ‌నం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అయితే ఆది న‌టించిన సినిమాల్లో `టాప్ గేర్‌` బెట‌ర్ గా వుంద‌ని ఆడియ‌న్స్ మాట‌. అలా అని హిట్ అని చెప్ప‌ట్లేదు. బిలో యావ‌రేజ్ మూవీ అని తేల్చేశారు. సెకండ్ హాఫ్ ని మ‌రింత ఇంట్రెస్టింగ్ గా మలిచి వుంటే ఫ‌లితం మ‌రోలా వుండేది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.