Begin typing your search above and press return to search.

'దృశ్యం 2'లో అదిరిపోయే ట్విస్ట్ అదే!

By:  Tupaki Desk   |   15 April 2021 2:30 PM GMT
దృశ్యం 2లో అదిరిపోయే ట్విస్ట్ అదే!
X
'దృశ్యం' సినిమా కథ అంతా కూడా ఒక మధ్యతరరగతి కుటుంబం చుట్టూ .. ఒక ఆడపిల్ల తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక మధ్యతరగతి తండ్రి పడే ఆరాటంగా .. పోరాటంగా ఈ కథ నడుస్తుంది. ప్ర్రతి మధ్యతరగతి ఆడపిల్ల తండ్రి .. వెంకటేశ్ పాత్ర్రకి కనెక్ట్ అవుతాడు. ఆ పాత్రను చివరివరకూ ఫాలో అవుతూ వెళతాడు. సినిమా ఎక్కడికక్కడ అనూహ్యమైన మలుపులు తీసుకుంటూ .. ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది.

ఈ సినిమాలో హీరో తాను హత్య చేసిన యువకుడిని నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రదేశంలో పూడ్చి పెడతాడు. ఇదే ఈ సినిమాలో హైలైట్ అయింది. పోలీసులు హీరో ఇంటిచుట్టూ తిరుగుతుంటారు .. హీరో దాచిన శవం పోలీస్ స్టేషన్ క్రిందే ఉంటుంది. సినిమా చూసిన ప్ర్రతి ఒక్కరికీ కూడా ఈ ఐడియా బాగుందనిపిస్తుంది. అంతకు మించిన సీన్ ఒకటి 'దృశ్యం 2'లో కనిపిస్తుంది. మొదటిభాగంలో హీరో పోలీసులను తన ఉచ్చులో బిగిస్తే, రెండవ భాగంలో పోలీసులు అతనిని ఉచ్చులో బిగించడానికి ఏం చేశారనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

పోలీసుల వ్యూహానికి సంబంధించిన ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తంలోకి ఇదే హైలైట్ సీన్ గా నిలుస్తుంది. మలయాళ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ నే తెలుగు రీమేక్ కి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనుంది. ఇప్పటికే చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మలయాళ సీక్వెల్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన, తెలుగు సీక్వెల్ కూడా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో వెంకటేశ్ అభిమానులు ఉన్నారు.