Begin typing your search above and press return to search.

`కేజీఎఫ్ 3` గురించి మైండ్ బ్లోయింగ్ అప్ డేట్

By:  Tupaki Desk   |   28 April 2022 9:00 AM IST
`కేజీఎఫ్ 3` గురించి మైండ్ బ్లోయింగ్ అప్ డేట్
X
రాఖీభాయ్ నిజంగా వున్నాడో లేదో తెలియ‌దు కానీ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` మాత్రం యావ‌త్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ రికార్డుల మోత మోగిస్తోంది. గ‌రుడ‌ని చంపిన త‌రువాత రాఖీ ఎలా కేజీఎఫ్ ని ఎలా హ‌స్త‌గ‌తం చేసుకున్నాడు అనే నేప‌థ్యంలో చాప్ట‌ర్ 2 ని న‌డిపించారు. ఇందులో రాఖీ పాత్ర‌ని చూపించిన తీరు, ఎలివేష‌న్స్.. యాంగ్రీ మ్యాన్ గా యష్ స్వాగ్‌..ప్ర‌శాంత్ నీల్ టేకింగ్.. ర‌వి బాస్రూర్ అందించిన నేప‌థ్య సంగీతం, భువ‌న్ గౌడ ఫొటోగ్ర‌ఫీ వెర‌సి ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌బెట్టాయి.

అంతే కాకుండా ఈ చాప్ట‌ర్ 2 అంతా కేజీఎఫ్ ఎంపైర్ ని రాఖీ హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం, వానరాన్ని స‌ర్వ‌సైన్యాధికారిగా నియ‌మించి కొత్త గేమ్ ని మొద‌లు పెట్ట‌డం.. ఇండియా, రమికా సేన్, అధీరా, దుబాయ్ లో వున్న ఇనాయత్ ఖలీల్ నేపథ్యంలో సాగింది. కానీ చాప్టర్ 3 అంతకు మించి వుంటుందట. రాఖీ సామ్రాజ్యం, అతని కార్యకలాపాలు బిగ్గెస్ట్ నేషనల్ లెవల్ ఇష్యూ అంటూ సీబీఐ ఆఫీసర్ రాఘవన్ పాత్ర ధారి రావు రమేష్ తో చెప్పించారు. అంతే కాకుండా చాప్ట‌ర్ 3 కూడా వుందంటూ ఎండింగ్ లో స్ప‌ష్టం చేశారు. దీంతో పార్ట్ 3 పై భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. ఎలా వుంటుంది? .. స‌ముద్రంలో మున‌గిన రాఖీ మ‌ళ్లీ లేస్తాడా? అనే చ‌ర్చ అభిమానుల్లో మొద‌లైంది.

ఇదిలా వుంటే చాప్ట్ 3 కి సంబందించిన స‌ర్ ప్రైజింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. హీరో య‌ష్ కూడా చాప్ట‌ర్ 3 అంత‌కు మించి వుంటుంద‌ని, దీనికి సంబంధించిన ఐడియా ముందే అనుకున్నామ‌ని క్లారిటీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ హాలీవుడ్ మీడియాకు య‌ష్ ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాప్ట‌ర్ 3కి సంబంధించిన కీల‌క విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. `కొన్ని స‌న్నివేశాల‌ను, ఆలోచ‌న‌ల‌ను చాప్ట‌ర్ 3 లో ఎగ్జిక్యూట్ చేయ‌లేక‌పోయాం. వాటిని మూడ‌వ భాగంలో చూపిస్తాం. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి చాలా స‌మ‌యం వున్నా కేజీఎఫ్ 3 భారీగా వుంటుంది. ఇంత‌కు మించి వుంటుందని య‌ష్ స్ప‌స్టం చేశాడు.

య‌ష్ చెప్పిన విష‌యాల‌ని బ‌ట్టి పార్ట్ 3 లో రాఖీ ఓ ఇంటర్నేషనల్ ఇష్యూగా మారడం చూపించబోతున్నార‌ని తెలుస్తోంది. ఇందుకు క్లైమాక్స్ లో హింట్ ల‌ని వ‌దిలారు కూడా. పార్ట్ 2 క్లైమాక్స్ లో ప్ర‌ధాని ర‌మికా సేన్ .. రాఖీ భాయ్ పై డెత్ వారెంట్ ని ఇష్యూ చేయ‌డం.. కేజీఎఫ్ ని నేల‌మ‌ట్టం చేయ‌మ‌ని వాయు సేన‌ల‌ని పంపించి రాఖీ ఎంపైర్ పై బాంబుల వ‌ర్షం కురిపించ‌మ‌ని చెప్ప‌డంతో అక్క‌డ వుండ‌టం ఇక సేఫ్ కాద‌ని భావించిన రాఖీ త‌న భార్య అంత్య‌క్రియ‌లు పూర్తి చేసి అంద‌రిని కేజీఎఫ్ వ‌దిలి వెళ్ల‌మ‌ని చెబుతాడు.

కేజీఎఫ్ పై సైనిక చ‌ర్య జ‌రుగుతుంటే అక్క‌డ రాఖీ లేడ‌ని తెలుస్తుంది. ఇదే విష‌యాన్ని సీబీఐ ఆఫీస‌ర్ రాఘ‌వ‌న్ కి, ప్ర‌ధాని ర‌మికా సేన్ కి అధికారులు తెలియ‌జేస్తారు. ఇంత‌కీ రాఖీ ఎక్క‌డ అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో ఇండియ‌న్ ఓష‌న్ నుంచి క‌స్టమ్స్ అధికారి `మీరు వెతుకుతున్న రాఖీ ఇండియ‌న్ ఓష‌న్ లోనే వున్నాడ‌ని, త‌ను మావైపే వ‌స్తున్నాడ‌ని, ఈ విష‌యాన్ని తానే మాకు ఫ్యాక్స్ ద్వారా తెలియ‌జేశాడ‌ని చెబుతాడు. కేజీఎఫ్ లో బ‌య‌టికి తీసిన బంగారాన్నంతా కంటైన‌ర్ ల‌లో పెట్టించి ఓ భారీ షిప్ లో ఇండియ‌న్ ఓష‌న్ లో ప్ర‌త్య‌క్ష మ‌వుతాడు రాఖీ.

ఇండియన్ ఓషన్ లో భారీ షిప్ లో బంగారాన్నంతా తీసుకుని అధికార యంత్రాంగం షిప్ కి ఎదురుగా వెళుతున్న రాఖీ ఇండియ‌న్ అధికారుల‌తో పాటు అమెరికన్ లకు, ఇండోనేషియా అధికారులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం ఇచ్చాడ‌ని ఓ అధికారి స‌మాచారం అందిస్తాడు. ఆ త‌రువాత ర‌మికా సేన్ ఉత్త‌ర్వుల‌తో రాఖీ షిప్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తారు. క‌ట్ చేస్తే రాఖీ.. బంగారం అంతా స‌ముద్రంలో ప‌డిపోవ‌డం చూపించి అక్క‌డ ఎండ్ కార్డ్ వేశాడు ప్ర‌శాంత్ నీల్‌. ఆ త‌రువాత ర‌మికా సేన్ ముందుకి అమెరికాకు చెందిన అధికారులు, ఇండోనేషియ అధికారులు త‌మ దేశంలో రాఖీ చేసిన కార్య‌క‌లాపాల‌పై ఓ ఫైల్ ని ర‌మికా సేన్ కి అంద‌జేసిన‌ట్టుగా చూపించి ఫైన‌ల్ గా ఎండ్ చేశాడు.

స‌ముద్రంలో బంగారంతో నింపిన కంటైన‌ర్ల‌తో ప‌డిపోయిన రాఖీ పార్ట్ 3 కి వ‌చ్చేసరికి ర‌ష్యాకు చెందిన స‌బ్ బెరైన్ స‌హాయంతో ఇండియ‌న్ ఓష‌న్ నుంచి త‌ప్పించుకుంటాడ‌ని తెలుస్తోంది. అలా బ‌య‌టికి వ‌చ్చిన రాఖీ క‌థ అమెరికాలో, ఇండోనేషియాలో మొద‌లువుంద‌ట‌. పార్ట్ 1, 2 ల‌లో రాఖి ని ఓ నేష‌న‌ల్ ఇష్యూగా చూపించిన ప్ర‌శాంత్ నీల్ పార్ట్ 3ని రాఖీ ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మ‌స్య‌గా చూపించ‌బోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదే నిజ‌మైతే ఇండియ‌న్ ప్రేక్ష‌కులు పార్ట్3 రూపంలో మ‌రో హాలీవుడ్ ఫీల్ వున్న సినిమాని చూడ‌బోతుండ‌టం గ్యారెంటీ.