Begin typing your search above and press return to search.

మైండ్ బ్లాక్ చేసిన మిల్కీ బ్యూటీ వెరైటీ స్టైల్

By:  Tupaki Desk   |   18 March 2022 6:36 AM GMT
మైండ్ బ్లాక్ చేసిన మిల్కీ బ్యూటీ వెరైటీ స్టైల్
X
మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు అంటూ తెలుగు కుర్ర‌కారుకు కంటి మీద కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది త‌మ‌న్నా భాటియా. ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డి అలికిడి టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ఏమంత లేదు. ఈ స‌మ‌యంలో ఏం చేస్తోందా? అని వెతికితే ఇదిగో అక్క‌డ తేలింది. ప్ర‌స్తుతం అంద‌రూ పాన్ ఇండియా ఫీవ‌ర్ తో రాజుకుపోతున్నారు.

కొంద‌రు జాతీయ స్థాయిలో పేరు తెచ్చే వెబ్ సిరీస్ లలో న‌టిస్తుంటే మ‌రికొంద‌రు సింగిల్ ఆల్బ‌మ్స్ అంటూ పాట‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. త‌మ‌న్నా భాటి ఈ రెండో మార్గాన్ని ఎన్నుకుంది.

తమన్నా భాటియా తాజాగా ప్ర‌ముఖ పాప్ గాయ‌కుడు బాద్షా కొత్త పాటలో మెరుపులు మెరిపించింది. సాంగ్ ఇంత‌కుముందే విడుద‌ల కాగా.. మంత్రముగ్దులను చేస్తూ ఇంటర్నెట్ లో తబాహిని సృష్టించింది విడుదలైన నాలుగు గంటల్లోనే పాట 358000 వీక్షణలను పొందింది ఇప్పటికీ కౌంట్ కొన‌సాగుతోంది.

బాద్షా 'తబాహి'లో తమన్నా భాటియా మైండ్ బ్లోవింగ్ డ్యాన్స్ ఇంటర్నెట్ లో సునామీని సృష్టించింది. తబాహికి త‌మన్నా బోలెడంత ప్ర‌చారం చేస్తోంది. త‌బాహి గురించి తమన్నా మాట్లాడుతూ, "నేను బాద్షాతో కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. అతనితో వీడియో మేకింగ్ బ్లాస్ట్! నేను ఈ పాటను మొదటిసారి విన్నప్పటి నుండి నేను రహస్యంగా నాలో నేనే హమ్ చేస్తున్నాను. ఇప్పుడు చివరకు నేను దానిని బిగ్గరగా పాడగలను!" అంటూ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది.

ఆల్బ‌మ్ ప్ర‌చారంలో భాగంగా తాజా ఫోటోషూట్ తో త‌మ‌న్నా మైండ్ బ్లాక్ చేసింద‌నే చెప్పాలి. వంగ పువ్వు రంగు టాప్ .. డార్క్ షేడెడ్ ఫ్యాంటుతో త‌మ‌న్నా స్టైలింగ్ సంథింగ్ హాట్ గా యూనిక్ గా క‌నిపిస్తోంది. అలా వీడియోగ్రాఫ‌ర్లు ఫోటోగ్రాఫ‌ర్ల ముందు మిల్కీ హొయ‌లు పోయిన తీరు మ‌తులు చెడ‌గొడుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ ప్ర‌య‌త్నం చూస్తుంటే ఇక‌పై తాను కూడా పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవాల‌ని క‌ల‌లుగంటోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాహుబ‌లి అవంతికగా త‌న‌కు ద‌క్కిన గుర్తింపును.. సైరా కీర్ లో తో వ‌చ్చిన గుర్తింపును కూడా హిందీ ప‌రిశ్ర‌మ‌లో వ‌ర్క‌వుట్ చేసుకోవ‌డంలో ఫెయిలైన త‌మ‌న్నా లేటెస్ట్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించాల‌ని ఆకాంక్షిద్దాం.