Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ మహేష్ ఫిట్‌‌ నెస్ సీక్రెట్ బయటపెట్టిన ట్రైనర్‌‌...!

By:  Tupaki Desk   |   20 May 2020 4:30 PM GMT
సూపర్ స్టార్ మహేష్ ఫిట్‌‌ నెస్ సీక్రెట్ బయటపెట్టిన ట్రైనర్‌‌...!
X
టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు అందం.. బాడీ ఫిట్‌‌ నెస్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయనకు నాలుగు పదుల వయస్సు వచ్చినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు. అంటే ఏ రేంజ్‌‌లో ఆయన బాడీ మెయింటేన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అందుకే మహేశ్ అంటే యూత్ అంతలా పడిచచ్చేలా ప్రేమిస్తుంటారు. అందుకే మహేష్ అందానికి.. ఫిట్‌‌ నెస్‌‌ కు ఫిదా అయిపోయి లేడీ ఫ్యాన్స్‌‌ ఆ రేంజ్‌‌ లో ఆయన్ను ఫాలో అవుతుంటారు. ఈ మధ్య ఆయన పోస్ట్ చేస్తున్న ఫోటోలలో మహేష్ లుక్ చూస్తే గౌతమ్ కి అన్నలా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ లుక్స్ కి టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఎవరూ పోటీ పడలేరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. రోజురోజుకు తన గ్లామర్ ను పెంచుకుంటూ వెలుతున్న మహేష్ సీక్రెట్ ఏంటని తెలుసుకోడానికి అందరికీ ఆశక్తిగానే ఉంటుంది. అయితే మహేష్ ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి అతనికి జిమ్ ట్రైనర్ గా పని చేసిన మినాష్ గాబ్రియేల్ సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు చెప్పుకొచ్చాడు. మినాష్ గాబ్రియల్ అనే ప్రొఫెషనల్ జిమ్నాజియం ట్రైనర్‌‌ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. పెద్ద పెద్ద అథ్లెట్స్ మొదలుకుని స్టారో హీరోల వరకు ఈయన దగ్గరికే ఫిట్‌ నెస్ కోసం వస్తుంటారు. టాలీవుడ్‌‌ సూపర్‌ స్టార్‌ కు కూడా మినాషే ట్రైనింగ్ ఇచ్చాడు.

మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన 'మహర్షి' సినిమా కోసం మహేష్ లుక్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ గా మినాష్ గాబ్రియేల్ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో మినాష్ ట్రైనింగ్ వలన నేను చాలా హెల్తీ మరియు ఫిట్ గా ఉన్నట్లు మహేష్ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మినాష్ అది గుర్తు చేసుకుంటూ.. ''ప్రతి రోజు చివరి రోజు వలె ట్రైనింగ్ సెషన్స్ లో మహేష్ కష్టపడే వారని.. ఇక డైట్ విషయంలో స్ట్రిక్ట్ మెనూ ఫాలో అయ్యేవారని.. అతనితో పని చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని మినాష్ గాబ్రియేల్ తన సోషల్ మీడియాలో తెలియజేశారు. మహర్షి సినిమా చాలా రీజన్స్ వల్ల నా హృదయానికి చాలా దగ్గరయింది. ఆ సమయంలో నేను మహేష్ ని చాలా దగ్గరగా చూసాను. మహేష్ కమిటెడ్ యాక్టర్ మరియు డెడికేటెడ్ పర్సనాలిటీ.. మీతో మళ్ళీ కలిసి పని చేయడానికి ఆతృతగా వెయిట్ చేస్తున్నాను'' అని పోస్ట్ చేసారు. గతంలో కూడా మినాష్ మహేష్ గురించి మాట్లాడుతూ "మహేశ్‌‌ కు శిక్షణ ఇవ్వడం గొప్ప అనుభూతి, ప్రయాణం.. అనుభవం. ఆయన్ను ఒక అథ్లెట్‌‌ గా చెప్పుకోవచ్చు. ఆయనకు శిక్షణ ఇచ్చినన్ని రోజులు చాలా ఎంజాయ్‌ చేశాను" అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా మహేష్ తో కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేసి తన అనుభవాలను పంచుకున్నాడు.