Begin typing your search above and press return to search.

మిల్కీ తమన్నా సిల్వర్ తమన్నాల మారిపోయిందే

By:  Tupaki Desk   |   4 May 2022 7:30 AM GMT
మిల్కీ తమన్నా సిల్వర్ తమన్నాల మారిపోయిందే
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా కూడా అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. సినిమాల్లో ఆఫర్లు తగ్గినా కూడా ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని పదే పదే నిరూపితం అవుతుంది. ఆమె ఐటెం సాంగ్‌ చేసినా.. ప్రత్యేక పాత్రలో నటించినా కూడా సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కనుక ఇప్పుడు కూడా ఆమెకు కోట్ల లోనే పారితోషికం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

తమన్నా సినిమాలు.. వెబ్‌ సిరీస్ లతోనే కాకుండా తన ఫోటో షూట్స్ తో కూడా రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో ఉంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒక మ్యాగజైన్ కవర్‌ పై సందడి చేస్తున్న తమన్నా తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. హీరోయిన్ గా ఆమె బిజీగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ గా ఉంటుంది. తన హాట్‌ అందాలతో ఫాలోవర్స్ ను మైమరపిస్తూనే ఉంది.

తాజాగా మిల్కీ బ్యూటీ కాస్త ఇలా సిల్వర్ బ్యూటీ అయ్యింది. టాప్ టు బాటమ్‌ సిల్వర్ కాస్ట్యూమ్స్ తో ఈ అమ్మడు అదరగొట్టింది. వావ్‌ అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపించేలా ఈ అమ్మడి సిల్వర్ లుక్‌ ఉంది.

అందమైన ఈ అమ్మడికి ఏ కాస్ట్యూమ్‌ అయినా అద్బుతంగా సెట్‌ అవుతుందని ఈ సిల్వర్ డ్రస్ మరోసారి నిరూపించింది. సిల్వర్ కలర్‌ డ్రస్ లో తమన్నా డ్రస్ కంటే కూడా అధికంగా మెరుస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అభిమానులు ఈ ఫోటోలను ఎప్పటిలాగే తెగ షేర్ చేస్తున్నారు. అందం మరింత పెరిగినట్లుగా తమన్నా లుక్ ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. మిల్కీ బ్యూటీ హ్యాపీ డేస్ నుండి మొదలుకుని ఇప్పటి వరకు తన అందం అంతకంతకు పెంచుకుంటూ పోతుందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి తో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు వెబ్‌ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళంలో ఈ అమ్మడు ఒక సినిమా ను చేస్తోంది. హిందీలో కూడా ఈ అమ్మడు ఒక సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్‌ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో మరియు ఐటెం సాంగ్స్ ను కూడా తమన్నా చేస్తున్న విషయం తెల్సిందే.