Begin typing your search above and press return to search.
కొవ్వు తగ్గించుకోమని మిల్కీని కామెంట్ చేశారు
By: Tupaki Desk | 12 Dec 2020 4:33 PM ISTతనకు కొవ్వు పెరిగిందని అదనపు బరువు తగ్గించుకోవాలని తీవ్రమైన కామెంట్ చేశారని ఆవేదన చెందారు మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. తాను కరోనాకి చికిత్స పొందుతున్న వేళ అధిక బరువు పెరగడంతో దానిపై నెటిజనుల్లో కామెంట్లు వినిపించాయని వెల్లడించింది.
నిజానికి అందం కాపాడుకుంటే సరిపోదు. ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తమన్నా తెలిపింది. అలాగే `మిల్కీ వైట్ బ్యూటీ` అన్న ట్యాగ్ కూడా తనకు ఇష్టం ఉండదట. ఆ ట్యాగ్ ని తొలగించుకోవాలని ఉందని కూడా తెలిపింది. అయినా శరీర ఛాయపై మోజు పెంచుకుని మత్తులో ఉండిపోవడం సరికాదని కూడా తమన్నా అంది. కొత్తగా మిల్కీ లెస్ బ్యూటీ అని పిలిపించుకోవాలనుందట. తనని అస్సలు అలా పిలవొద్దని కూడా సూచించింది. రంగు కంటే పనితనం చూడాలని తమన్నా అంది.
ఆహా - తెలుగులో సామ్ జామ్ కార్యక్రమంలో తమన్నా ఎలాంటి భేషజం లేకుండా ఈ విషయాలన్నిటినీ ముచ్చటించడం ఆసక్తికరం. తమన్నా ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాతో పాటు గుర్తుందా శీతాకాలం అనే చిత్రంలోనూ నటిస్తోంది.