Begin typing your search above and press return to search.

'ల‌స్ట్ స్టోరీస్-2' లో మిల్కీబ్యూటీ మెరుపులు!

By:  Tupaki Desk   |   24 Aug 2022 6:43 AM GMT
ల‌స్ట్ స్టోరీస్-2 లో మిల్కీబ్యూటీ మెరుపులు!
X
మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సైతం బాలీవుడ్ కెరీర్ పై ఫోక‌స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ న‌టి అయినా బాలీవుడ్ లో ఏక‌ధాటిగా ఇంత‌వ‌ర‌కూ సినిమాలు చేయ‌లేదు. టాలీవుడ్...బాలీవుడ్ రెండంటిని బ్యాలెన్స్ చేసే ప్ర‌య‌త్నంలో తెలుగులోనే ఫేమ‌స్ అయింది. అయితే ఇప్ప‌డు తెలుగులో అంత బిజీగా లేదు. వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంట‌నే మెయిన్ మార్కెట్ హిందీ అంటూ ముందుకు సాగుతోది.

ఈ క్ర‌మంలోనే హిందీ టెలివిజ‌న్ షోస్..మ్యూజిక్ వీడియోల్లోనూ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు బాలీవుడ్ లో 'బ‌బ్లీ బౌన్స‌ర్' ..'బోల్ చుడేయాన్'..'ప్లాన్ ఏ ప్లాన్ బీ' చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ చిత్రాల షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు నెట్ ప్లిక్స్ సంచ‌ల‌న సిరీస్ 'ల‌స్ట్ స్టోరీస్ -2'కి ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. సుజోయ్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ల‌స్ట్ స్టోరీస్ -2 లో మిల్కీని మెయిన్ లీడ్ కి ఎంపిక చేసిన‌ట్లు సమాచారం.

ఇంద‌లో హీరోగా విజ‌య్ వ‌ర్మ న‌టిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి పై టెస్ట్ షూట్ స‌హా కొన్ని రిహార్స‌ల్స్ సైతం చేస్త‌సున్న‌ట్లు స‌మాచారం. త‌మ‌న్నా-విజ‌య్ జంట‌గా న‌టించ‌డం ఇదే తొలిసారి. ఆ కాంబినేష‌న్ ఎంత వ‌ర‌కూ వ‌ర్కౌట్ అవుతుంద‌న్న‌ది టెస్ట్ షూట్ ద్వారా ముందుగానే డిసైడ్ చేస్తారుట‌.

అటుపై లోపాలేమైనా ఉంటే వాటిని స‌రిదిద్దుకోవ‌డానికి ఛాన్స్ ఉంటుంద‌ని ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ల‌స్ట్ స్టోరీస్ ఎంతో పాపుల‌ర్. ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌కు మంచి పేరొచ్చింది. కియారా అద్వాణీ బాలీవుడ్ లో అంత ఫేమ‌స్ కావ‌డానికి కార‌ణం ఈ చిత్ర‌మే. రాధికా ఆప్టే..విక్కీ కౌశ‌ల్ కి సైతం మంచి పేరు తీసుకొచ్చింది ఈ ఆంథాల‌జీ చిత్రం.

ఈ నేప‌థ్యంలో రెండ‌వ భాగాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఆర్ బాల్కీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు ప్ర చారంలో ఉంది. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల‌కు మృణాల్ ఠాకూర్..అంగ‌ద్ ఏబీ..నీనా గుప్లాల్ని ఎంపిక చేసిన‌ట్లు బాలీవుడ్ లో మీడియాలో ప్ర‌చారం సాగింది. కానీ తాజా స‌మాచారం నేపథ్యంలో ఇదంతా కేవ‌లం ప్ర‌చార‌మ‌ని మెజార్టీ వ‌ర్గం భావిస్తుంది.