Begin typing your search above and press return to search.
మిల్కీకి అవార్డుల్లో అన్యాయం జరిగిందా?
By: Tupaki Desk | 25 July 2020 11:40 AM ISTఅవార్డులు అనేవి ఒక ప్రహసనం లాంటివి. అయినా ప్రేక్షకాభిమానుల పొగడ్తలనే ఉత్తమ అవార్డుగా భావిస్తాం! అని చాలా మంది స్టార్లు ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. అవార్డుల ఎంపికపై పెదవి విరిచేసే కంటే వాటి గురించి పట్టించుకునే సమయమే లేదని చెప్పే స్టార్లే ఎక్కువ.
తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా అవార్డుల విషయంలో తనకు జరిగిన అన్యాయంపై ఓపెనవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అసలు అవార్డులకు ఎలా ఎంపిక చేస్తారు? వాటి ప్రాతిపదికలు ఏమిటి? అన్నదానిపైనా తమన్నా నర్మగర్భంగా ఓ చిట్ చాట్ లో ఓపెనైంది.
అవార్డులకు ఎంపిక అనేది అభిమానుల్ని తగ్గించదని ఫేట్ మార్చదని తమన్నా ఈ చాట్ లో తెలిపింది. నా సినిమాలు తీసే విధానం సంతృప్తికరంగా ఉంటే.. అవి బాగా ఆడితే అంతకు మించి ఇంకేదీ ముఖ్యం కాదు. అవార్డుల్ని పట్టించుకోను అని కూడా తమన్నా వ్యాఖ్యానించడం ఆసక్తికరం. అయితే మిల్కీ వైట్ బ్యూటీ చాలాసార్లు అవార్డులకు నామినేట్ అయినా అవి తన వశం కాకపోవడంపై కొద్దిపాటి అసంతృప్తిని వ్యక్తం చేసింది. తనకు కేవలం అతికొద్ది అవార్డులు మాత్రమే దక్కడంపై బయటపడకపోయినా.. ఇన్ సైడ్ మిల్కీ ఫీలింగ్ ఏమిటన్నది తాజా ప్రకటనతో బయటపడిపోయింది.
అయితే మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ధంన్నర కెరీర్ ని పరిశీలిస్తే.. తనకు అవార్డు రేంజ్ నటనకు ఆస్కారం ఎక్కడా కనిపించదు. మెజారిటీ పార్ట్ గ్లామర్ డాళ్ పాత్రల్లోనే కనిపించింది. ఇటీవల సైరా నరసింహారెడ్డిలో పాత్ర మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఎక్కడైనా చూడగలమా? అప్పట్లో 100 పర్సంట్ లవ్ చిత్రంలో నటనకు కొన్ని లోకల్ అవార్డులు అందుకుంది. కెరీర్ లో ఫిలింఫేర్ ..సంతోషం..ఐఫా అవార్డులు మినహా నంది రేంజ్ అవార్డ్ ఏదైనా ఉందా? అంటే అబ్బే అదేమీ లేదుగా!