Begin typing your search above and press return to search.

నాలుగేళ్లుగా ఊరించి ఓటీటీలో వదలబోతున్నారు

By:  Tupaki Desk   |   22 July 2020 2:20 PM IST
నాలుగేళ్లుగా ఊరించి ఓటీటీలో వదలబోతున్నారు
X
2014లో బాలీవుడ్‌ లో వచ్చిన ‘క్వీన్‌’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ఈ రీమేక్‌ ల గురించి మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగులో ఈ రీమేక్‌ లో తమన్నా నటిస్తుండగా తమిళంలో కాజల్‌ నటించింది. ఆర్థిక సమస్యలు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. తెలుగు.. తమిళం.. కన్నడం.. మలయాళంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయినా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఇప్పుడు ఓటీటీలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్దం అవుతున్నారు.

క్వీన్‌ చిత్రంతో జాతీయ అవార్డు దక్కించుకున్న కంగనా రనౌత్‌ పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తుంది. ఆమె స్థాయిలో సౌత్‌ హీరోయిన్స్‌ చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సినిమాను ఎలా తెరకెక్కించి ఉంటారు అనే ఆసక్తి సౌత్‌ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. తెలుగులో ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ’ అనే టైటిల్‌ తో ఈ సినిమాను రూపొందించారు. తెలుగు రీమేక్‌ కు ఇద్దరు ముగ్గురు దర్శకులు మారారు. చివరకు ప్రశాంత్‌ వర్మ సినిమాను ఫినీష్‌ చేశాడు.

థియేటర్లలో విడుదల చేసేందుకు ఆర్థిక సమస్యలు అడ్డుగా ఉండటం వల్ల సినిమాను నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. నాలుగు భాషల్లో రూపొందిన క్వీన్‌ ను ఒకే సారి విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఓటీటీ లో తెలుగు రీమేక్‌ కు మంచి రేటు వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. నాలుగు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ ఊరించి ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దం అవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు.