Begin typing your search above and press return to search.

'లస్ట్ స్టోరీస్ 2'లో మిల్కీ వైట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   25 Aug 2022 4:59 AM GMT
లస్ట్ స్టోరీస్ 2లో మిల్కీ వైట్ బ్యూటీ
X
తెలుగు ఆడియెన్ కి 'ల‌స్ట్ స్టోరీస్' గురించి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. హిందీ వెర్ష‌న్ ల‌స్ట్ స్టోరీస్ తో పాటు తెలుగు వెర్ష‌న్ ని కూడా ఓటీటీల్లో వీక్షించారు. ఇప్పుడు ల‌స్ట్ స్టోరీస్ 2 తెర‌కెక్క‌నుంది. దీనికి సుజోయ్ ఘోష్‌ ద‌ర్శ‌కుడు. లస్ట్ స్టోరీస్ 2లో నెట్ ఫ్లిక్స్ మద్దతుతో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఇది. ఈ సంకలన చిత్రంలో ఒక ఎపిసోడ్ కి కథానాయికగా తమన్నా భాటియాను ద‌ర్శ‌కుడు సుజోయ్ ఎంచుకున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. తమన్నా- విజయ్ వ‌ర్మ‌ల‌తో వచ్చే నెల నుండి సుజోయ్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ తేదీకి దగ్గరగా ప్రిపరేషన్ ని మొద‌లు పెట్టార‌ని స‌మాచారం. కొంతకాలం క్రితం త‌మ‌న్నా సుజోయ్ ఘోష్ కార్యాలయంలో కూడా కనిపించింది.

తమన్నా భాటియా- సుజోయ్ ఘోష్ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. అయితే విజయ్ - సుజోయ్ ఇప్పటికే 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌'లో కలిసి పనిచేశారు. ఇందులో కరీనా కపూర్ ఖాన్ - జైదీప్ అహ్లావత్ కలిసి నటించారు.

తాజా స‌మాచారం మేర‌కు 'లస్ట్ స్టోరీస్ 2'లో మృణాల్ ఠాకూర్ కూడా న‌టించ‌నుంద‌ని తెలిసింది. అంగద్ బేడి - నీనా గుప్తాలను లాక్ చేసారని ఇప్పటికే వీరితో ఎపిసోడ్ షూటింగ్ ని ద‌ర్శ‌కుడు ఆర్.బాల్కీ పూర్తి చేసార‌ని కూడా తెలిసింది.

అమిత్ రవీందర్ నాథ్ శర్మ తెర‌కెక్కించే ఎపిసోడ్ లో కాజోల్ ప్ర‌ధాన పాత్ర‌ధారి కాగా కొంకణా సేన్ శర్మ తన షార్ట్ ఎపిసోడ్ కోసం తిలోత్త‌మా షోమ్ - అమృతా సుభాష్ లను ఎంపిక చేసుకున్నార‌ని తెలిసింది. లస్ట్ స్టోరీస్ 1ని దర్శకులు కరణ్ జోహార్ - అనురాగ్ కశ్యప్- జోయా అక్తర్ - దిబాకర్ బెనర్జీ తెర‌కెక్కించారు.

తమన్నా భాటియా తదుపరి మధుర్ భండార్కర్ 'బాబ్లీ బౌన్సర్‌'లో కనిపించనుంది. సెప్టెంబర్‌లో లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ ను తమన్నా ప్రారంభించనున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ ఇటీవ‌లే బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన తెలుగు సినిమా 'సీతారామం'లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.