Begin typing your search above and press return to search.

ఆ న‌టుడిని భార్య డాడీ అంటుంద‌ట‌!

By:  Tupaki Desk   |   15 Sep 2019 1:30 AM GMT
ఆ న‌టుడిని భార్య డాడీ అంటుంద‌ట‌!
X
భార్య‌ను ఆమె తండ్రిలాగే మ‌హ‌రాణిలా చూసుకునే భ‌ర్త‌లు ఉంటారు. అంత‌మాత్రాన భ‌ర్త‌ను డాడీ అని ఎవ‌రైనా అంటారా? ఆ పిలుపు చాలా ఎబ్బెట్టుగా ఉండ‌దూ. కానీ బాలీవుడ్ న‌టుడు - మోడ‌ల్ మిలింద్ సోమ‌న్‌ ను అత‌డి భార్య‌ అంకిత కొన్వ‌ర్ డాడీ అనే పిలుస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా వెల్ల‌డించింది. ఐతే మిలింద్‌ ను ఇలా పిల‌వ‌డానికి కార‌ణం.. అత‌డి వ‌య‌సే అని ఆమె వెల్ల‌డించ‌డం విశేషం. తొలి భార్య నుంచి విడాకులు తీసుకున్న మిలింద్‌కు అంకిత రెండో భార్య‌. గ‌త ఏడాదే వీరి పెళ్లి జ‌రిగింది. మిలింద్ వయసు 53 సంవత్సరాలు కాగా.. అంకిత వయసు 28 ఏళ్లే కావ‌డం గ‌మ‌నార్హం. తన వయసులో స‌రిగ్గా స‌గం వ‌య‌సున్న అంకిత‌ను మిలింద్ గ‌త ఏడాది ఏప్రిల్లో పెళ్లాడాడు.

మిలింద్‌కు దాదాపుగా త‌న త‌ల్లి వ‌య‌సే ఉండ‌టంతో అత‌డిని డాడీ అని పిలుస్తున్న‌ట్లుగా అంకిత ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ‘‘మిలింద్‌ కు నాకు 26 ఏళ్ల గ్యాప్. నా తల్లి వయసు మిలింద్ వయసు ఒకటే. ఐతే వ‌య‌సు అంత‌రం గురించి నాకు ఎలాంటి పట్టింపు లేదు. ప్రేమ - పెళ్లికి వయసు - ప్రాంతం - కులం - మతం అనేది అడ్డంకి కాదు. సమాజం రూపొందించిన కట్టుబాట్లు - అడ్డంకులే. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నప్పుడు కలిసి జీవించడం తప్పుకాదు కదా. తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకోనే హక్కు అందరికి ఉండాలి. అభిప్రాయాల - ఫీలింగ్స్‌ నే పరిగణనలోకి తీసుకోవాలి. నీకు నచ్చిందా సమాజాన్ని పక్కన పెట్టేయాలి. నాకు మిలింద్ అంటే ఇష్టం. నా కంటే వయసులో పెద్దైనా చేసుకొన్నాను. నా తల్లి వయసున్న మిలింద్‌ ను ప్రేమగా డాడీ అని పిలుస్తాను’’ అని అంకిత పేర్కొంది.