Begin typing your search above and press return to search.

వీల్ చైర్ లో మైక్ టైసన్.. ఆయన దుస్తితి వైరల్

By:  Tupaki Desk   |   21 Sep 2022 9:39 AM GMT
వీల్ చైర్ లో మైక్ టైసన్.. ఆయన దుస్తితి వైరల్
X
మైక్ టైసన్.. ఈ పేరు తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. అమెరికాకు చెందిన ఈ బాక్సర్ ఒకనొక సమయంలో తనను ఎవరూ ఓడించలేనంత ధృఢంగా తయారయ్యాడు. రింగ్ లోకి దిగితే ప్రత్యర్థులు భయపడేలా కనిపించేవాడు. ఎంతో మందిని ఓడించి ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్ గా ఒకనాడు నిలిచాడు.

ఇటీవలే లైగర్ సినిమాలోనూ 'మైక్ టైసన్' కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా ఈ మాజీ చాంపియన్ కు వయసు మీదపడింది. అనారోగ్యం వెంటాడుతోంది.

తాజాగా అమెరికాలోని మియామి విమానాశ్రయంలో టైసన్ వీల్ చైర్ లో కనపడడంతో అంతా షాక్ అయ్యారు. బాహుబలి లాంటి మైక్ టైసన్ ను ఇలా చక్రాల కుర్చీలో తోసుకురావడం చూసి అందరూ అయ్యో పాపం అన్నారు.

మియామీ విమానాశ్రయంలో వీల్ చైర్ లో కనిపించిన టైసన్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దానికి అసలు ఏంటి కారణం అని అందరూ ఆరాతీస్తూ కలవరపడడంతో టైసన్ క్లారిటీ ఇచ్చాడు..

తాను సయాటికా సమస్యతో బాధపడుతున్నట్టు తాజాగా టైసన్ తెలిపారు. ఈ సమస్య వల్ల వెన్ను కింది భాగం, పిరుదులు, కాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. నొప్పి తీవ్రమైనప్పుడు కనీసం మాట్లాడలేని.. నడవలేని స్థితి ఉంటుందట.. అందుకే వీల్ చైర్ లో తాను ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.

బాక్సింగ్ రింగ్ గడగడలాడించిన ఈ యోధుడిని ఇలా చూస్తామనుకోలేదని.. ఇలా చూడడం దురదృష్టకరమని.. టైసన్ కోలుకోవాలని చాలా మంది అభిమానులు వేడుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.